Movie News

ప్లానింగ్ లేదు పద్ధతి లేదు ఇవేం రీరిలీజులు

పాత సినిమాల రీ రిలీజుల వ్యవహారం తప్పుడు మలుపులు తిరుగుతోంది. అయిదారు నెలల క్రితం కొన్ని మంచి ఉద్దేశాలతో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ క్రమంగా బిజినెస్ రంగు పులుముకోవడంతో ఎవరికి వారు దీన్ని క్యాష్ చేసుకుందామనే తాపత్రయం పెరిగిపోయింది. ఈ కారణంగానే కొన్ని డిజాస్టర్లను సైతం థియేటర్లలో వదిలి కలెక్షన్ల కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని రెచ్చగొట్టి పని పూర్తి చేసుకున్న వాళ్ళున్నారు. వీటి సంగతేమో కానీ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అంతే సంగతులు

తాజాగా ఈ ఫిబ్రవరి 11 శనివారం రావాల్సిన గ్యాంగ్ లీడర్ ని క్యాన్సిల్ చేశారు. నాలుగు రోజుల క్రితమే కొన్ని ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం అడ్వాన్స్ గా ఫుల్ అయితే అదనంగా 35 ఎంఎం జోడించారు. సోషల్ మీడియాలో వివిధ ఊళ్ళ నుంచి అభిమానులు సెల్ఫ్ ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు తాపీగా గ్యాంగ్ లీడర్ లేదంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు. ముందుగా టికెట్లు కొన్నవాళ్లకు రీ ఫండ్ ఇస్తారు అది మాములే కానీ ఇప్పుడు చంపేసిన ఆసక్తిని మళ్ళీ ఇకపై పుట్టించగలరా అంటే సందేహమే.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు ఎంచుకున్న డేటే రాంగ్ టైమింగ్ లో ఉంది. పదిన అమిగోస్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఆరేడు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దిగుతున్నాయి. రైటర్ పద్మభూషణ్ విజయవంతంగా ఆడుతోంది. మైఖేల్, బుట్టబొమ్మలు సర్దుకున్నా వాల్తేరు వీరయ్యను కనీసం నెల రోజులు రన్ చేసేందుకు థియేటర్లు ముందే ఫిక్స్ అయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో వీరసింహారెడ్డి కొనసాగుతోంది. అలాంటప్పుడు గ్యాంగ్ లీడర్ కి థియేటర్లు దక్కడం గగనమే. ప్లానింగ్ పద్దతి లేకుండా రీరిలీజులు చేస్తే ఇలాగే అభిమానులను నిరాశపరచడం తప్ప ఏమీ జరగదు.

This post was last modified on February 8, 2023 1:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

53 minutes ago

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

2 hours ago

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

6 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

7 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

9 hours ago