టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్‌లో ఒక రచయిత, దర్శకుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతను ‘ఫలక్‌నుమా దాస్’తో దర్శకుడిగా మారాడు. కొన్ని సినిమాలకు స్క్రిప్టు వర్క్‌లోనూ పాలు పంచుకున్నాడు. అతను తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ధమ్కీ’ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మూడు నెలల కిందటే లాంచ్ కావడం విశేషం. ట్రైలర్ రెడీ అయిందంటే సినిమా విడుదలకు కూడా అప్పుడే సిద్ధం అయినట్లే. కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో పక్కాగా రిలీజ్ చేయడం కోసం విశ్వక్ అండ్ టీం బాగానే టైం తీసుకుంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ‘ధమ్కీ’ని రిలీజ్ చేయబోతున్నట్లు చాలా ముందుగానే ప్రకటించారు. కానీ తీరా ఆ డేట్ వచ్చేసరికి సినిమా అడ్రస్ లేదు. ‘శాకుంతలం’ టీం మాదిరి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు విశ్వక్ అండ్ కో.
ఐతే ఈ చిత్రం వాయిదా నిర్ణయం జనవరిలోనే జరిగిపోయినట్లు సమాచారం. మాస్ రాజా రవితేజ సినిమా ‘ధమాకా’ రిజల్ట్ చూశాక తమ చిత్రాన్ని కాస్త వాయిదా వేసుకోవడం మంచిదని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల కథల్లో సారూప్యతలు ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఒక బిలియనీర్ స్థానంలోకి ఒక మామూలు వ్యక్తి వెళ్లి అక్కడ వ్యవస్థను చక్కబెట్టే పాయింట్ మీదే రెండు సినిమాలూ నడిచాయి.
ఐతే ‘ధమాకా’లో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి కానీ.. అది డబుల్ రోల్ కాదు. ఆ సంగతి సినిమా చూసే వరకు తెలియదు. ఐతే ‘ధమాకా’ అంచనాలను మించి పెద్ద రేంజికి వెళ్లింది. బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆ సినిమాతో పోలికలు ఉన్న ‘ధమ్కీ’ రెండు నెలల్లోపే రిలీజైతే దానికి ఇబ్బంది తప్పదు. కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే మంచిదని ఫిక్సయి.. సినిమాను నిరవధికంగా వాయిదా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవికి ఎలాగూ భారీ చిత్రాలు లేవు కాబట్టి సీజన్ పరంగా కలిసొస్తుందన్న ఉద్దేశంతో ఏప్రిల్ లేదా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
This post was last modified on February 8, 2023 11:12 am
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…