Movie News

హరీష్ శంకర్ పంచ్ ఎవరికి ?

ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అందరికీ అజాత శత్రువుగా ఉంటారు. పెద్ద నుండి చిన్న వరకు అందరితో ఫ్రెండ్లీ గా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అలాంటి అల్లు అరవింద్ కి కూడా తాజాగా ఓ ఇన్సిడెంట్ కోపం తెప్పించింది. విజయ్ -పరశురామ్ కాంబోలో దిల్ రాజు సినిమా ప్రకటించడం విషయంలో అరవింద్ బాధ పడ్డారు. దీంతో ఒక్క ఫోన్ కాల్ చేసి ప్రెస్ మీట్ అంటూ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని గంటల్లోనే మళ్ళీ క్యాన్సిల్ చేసి వెనుక అంతా సెటిల్ చేసుకున్నారు.

అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కోపం దిల్ రాజు మీదే అంటూ కొందరూ, లేదు పరశురామ్ మీద అరవింద్ గుర్రున ఉన్నారంటూ ఇంకొందరు చెప్పుకున్నారు. ఇక హరీష్ శంకర్ వేసిన పంచ్ ఎవరికి అనేది చర్చ జరుగుతుంది. తాజాగా అల్లు అరవింద్ తన బేనర్ నుండి వస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నారు. ఇదే ఈవెంట్ కి హరీష్ శంకర్ గెస్ట్ గా వచ్చాడు. తన స్పీచ్ లో భాగంగా అల్లు అరవింద్ గారి గురించి అలాగే బన్నీ వాస్ ఫ్రెండ్ షిప్ గురించి కొన్ని విషయలు పంచుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ హరీష్ స్పీచ్ లో కొన్ని ద్వందర్థాలు దొర్లాయి.

“డబ్బులు పెట్టేసి ఫైనల్ కాపీ చూసుకునే నిర్మాతలు ఉంటారు. కానీ స్క్రిప్ట్ స్టేజ్ నుండి ఉండే నిర్మాత మాత్రం అల్లు అరవింద్ గారే అంటూ చెప్పాడు హరీష్. అలాంటి నిర్మాతలు ఫ్రెండ్స్ గా ఉండటం మన అదృష్టం, అలాంటి ఫ్రెండ్స్ ను ఎవరైనా దూరం చూసుకుంటే అది వారి దురదృష్టం అనేశాడు. ఇంతకంటే నేను ఇంకా నేనేం చెప్పలేను” అంటూ పంచ్ వేశాడు.

హరీష్ ఈవెంట్ లో అల్లు అరవింద్ గారికి ఫ్రెండ్ గా దూరం అవ్వడం దురదృష్టం అని ఎవరిని ఉద్దేశించి అన్నారో అని అక్కడి వాళ్ళు చెవులు కోరుక్కున్నారు. హరీష్ శంకర్ నిన్న జరిగిన ఇండస్ట్రీ ఇన్ సైడ్ రచ్చ గురించి చెప్తూ ఎవరినైనా ఇలా అనొచ్చా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

This post was last modified on February 7, 2023 10:40 pm

Share

Recent Posts

దర్శకుడు హీరో అయితే ఏమవుతుంది

దర్శకులు హీరోలు కావడం ఇండస్ట్రీకి కొత్త కాదు. కాకపోతే సక్సెస్ అయినవాళ్లు తక్కువ. ఉదాహరణకు ఎస్వి కృష్ణారెడ్డి మంచి పీక్స్…

8 minutes ago

రా ఎన్టీఆర్… మూత ప‌డిపోయింది

గ‌త కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన రా ఎన్టీఆర్ సంస్థ వ్య‌వ‌హారంలో ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంది.…

11 minutes ago

అస‌లైన ఐమాక్స్‌లో ఒడిస్సీ చూడాలంటే..?

ఐమాక్స్‌ లందు.. రియ‌ల్ ఐమాక్స్ వేరు అంటారు. ఈ ఫార్మాట్ మూడు ర‌కాల రేషియాల్లో ఉంటుంది. అందులో 70 ఎంఎం…

18 minutes ago

అనిల్ ఇచ్చిన బూస్ట్ సరిపోతుందా

తెలుగులో బజ్ కోసం పోరాడుతున్న జన నాయకుడుకి అనిల్ రావిపూడిని రంగంలోకి దించడం ద్వారా టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది.…

1 hour ago

ఇంటా బ‌య‌టా… నీట్‌ నిప్పులు!

కేంద్ర ప్ర‌భుత్వానికి ఇంటా బ‌య‌టా కూడా.. నీట్ ప‌రీక్ష‌కు సంబంధించిన సెగ భారీగా త‌గులుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ…

2 hours ago

అన్నయ్య డ్రాప్… తమ్ముడు ఫిక్స్ ?

బస్సులో మనం ఒక సీట్ ని రిజర్వ్ చేసుకుని, తీరా ప్రయాణానికి వెళ్లలేకపోతే వేరొకరికి ఇవ్వడమో లేదా అమ్మడమో జరుగుతుంది.…

3 hours ago