ఫిలిమ్ సిటీకి షిఫ్ట్ అవ్వనున్న పుష్ప

గతంలో చెప్పినట్టే ‘బాహుబలి’ రూట్లోనే ‘పుష్ప’ కోసం యూనిట్ రామోజీ ఫిలిమ్ సిటీకి షిఫ్ట్ అవ్వబోతుంది. ఇటీవలే వైజాగ్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది. మరో రెండ్రోజుల్లో ఫిలిమ్ సిటీలో వేసిన సెట్ లో సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ జరగనుంది.

ఇప్పటికే షూటింగ్ విషయంలో చాలా ఆలస్యం చేస్తూ వస్తున్న సుకుమార్ ఇకపై ఎక్కువ బ్రేకులు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఫిలిమ్ సిటీలోనే యూనిట్ తో ఉంటూ కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తీసే ఆలోచనలో ఉన్నాడు. రామోజీ ఫిలిమ్ సిటీ నుండి రోజు ప్రయాణం చేయకుండా ఆ టైమ్ ను కూడా షూటింగ్ కోసం వాడుకునే ప్లానింగ్ లో ఉన్నాడు సుక్కు.

ఇందులో భాగంగా పుష్ప టీం ఫిలిమ్ సిటీ కి షిఫ్ట్ అవ్వబోతుంది. అక్కడే ఉంటూ కొన్ని రోజుల పాటు ఘాట్ చేసే ప్లానింగ్ రెడీ అవుతుంది. టీంకి నిర్మాతలు అక్కడే నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. షూటింగ్ అవ్వడం కాస్త లేట్ అయినా అక్కడే ఉండేటట్టు ప్రణాళికా సిద్దం చేశారు. ఇక బన్నీ కి మినహాయింపు ఉండవచ్చు. లేదంటే రెండ్రోజుల కోసారి బన్నీ ఇంటికెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్ప2 షూటింగ్ విషయంలో సుకుమార్ స్పీడ్ పెంచాడు. మరి ఈ సుక్కు ఈ స్పీడ్ ఎంత వరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి.