టాలీవుడ్ లో రీమేక్ ల ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. అలాగే మన సినిమాలను కూడా మిగతా భాషల్లో రీమేక్స్ చేసుకున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగులో రీమేక్ ల ట్రెండ్ ఎక్కువ కనిపిస్తుంది. స్టార్ హీరోలు సైతం మన కథల కంటే రీమేక్ సినిమాలపైనే మక్కువ చూపిస్తున్నారు.
తెలుగులో రీసెంట్ గా వచ్చిన రీమేక్ సినిమాలు మేకర్స్ మంచి గుణపాఠాలు నేర్పాయి. భీమ్లా నాయక్ , గాడ్ ఫాదర్ సినిమాలను పక్కన పెడితే తెలుగులో వచ్చిన అల్మోస్ట్ అన్ని రీమేక్ సినిమాలు డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. అయితే భీమ్లా నాయక్ , గాడ్ ఫాదర్ సినిమాలకు మెగా ఇమేజ్ కలిసి రావడంతో కొంత వరకు వసూళ్లు రాబట్టి సేఫ్ జోన్లోకి వెల్లగలిగాయి. కానీ ఫైనల్ గా ఆ రెండు సినిమాలు కూడా భారీ సౌండ్ చేయలేకపోయాయి.
రాజశేఖర్ చాలా రీమేక్ సినిమాలు చేశారు. కానీ రీసెంట్ గా చేసిన ‘శేఖర్’ సినిమా మాత్రం ఆయనకి చేదు అనుభవం మిగిల్చింది. మక్కీ కీ మక్కీ తీసినా తెలుగులో ఈ రీమేక్ వర్కవుట్ అవ్వలేదు. మలయాళంలో సూపర్ హిట్టయిన జోసఫ్ సినిమాను ఏరి కోరి మరీ రీమేక్ చేశారు జీవిత రాజశేఖర్. స్వీయ దర్శకత్వం చేయడమే కాకుండా ఈ రీమేక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు జీవిత. హీరో కేరెక్టర్ తాలూకు బ్యాక్ డ్రాప్ ఏ మాత్రం ఛేంజ్ చేయకుండా ఈ సినిమాను తీశారు. జీవిత కంటే ముందు ఓ దర్శకుడు ఈ సినిమాను హ్యాండిల్ చేశారని తర్వాత జీవిత సీన్ లోకి ఎంటరై కెలికి తీయడం జరిగిందని ఇన్సైడ్ టాక్. దీంతో ఆమె ఎప్పటిలానే నిర్మాతగా కొంత లాస్ చూడాల్సి వచ్చింది.
పీవీపీ సినిమా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ రెండు సంస్థలు కలిసి తమిళ్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఓ మై కడవలే సినిమాను తెలుగులో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టుకున్నా వెంకటేశ లాంటి స్టార్ జాతకూడినా సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. భార్యాభర్తల గొడవను సాల్వ్ చేసేందుకు భూమిపైకి వచ్చిన దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో సినిమా థియేటర్స్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది.
కన్నడలో హిట్టయిన లవ్ మాక్టెల్ ను సత్య దేవ్ హీరోగా ‘గుర్తుందా సీతా కాలం’ అంటూ తెలుగులో రీమేక్ చేశారు. కన్నడ దర్శకుడినే పెట్టుకొని సినిమా తీశారు. తమన్నా ఒక హీరోయిన్ గా తీసుకున్నారు అయినా పనవ్వలేదు. మరీ ఇంత స్లో ఫేస్ లవ్ స్టోరీ అయితే కష్టమని ఆడియన్స్ సినిమాను రిజెక్ట్ చేశారు. పైగా తెలుగులో వచ్చేసిన కథతోనే సినిమా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకుంది.
ఇప్పుడు బుట్టబొమ్మ వంతు. మలయాళంలో సూపర్ హిట్ నిపించుకున్న చిన్న సినిమా కప్పెలా ను తెలుగులో కొత్త వాళ్ళతో రీమేక్ చేశాడు. తమిళ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయం ఉన్న అర్జున్ దాస్ తప్ప తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని కొత్త వారితో రీమేక్ చేశారు. చిన్న పాయింట్ తో రెండున్నర గంటల పాటు సాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి కనబరచలేదు. మరీ ఇలా కొత్త వాళ్ళతో కాకుండా ఎవరైనా తెలిసిన మొహాలు ఉంటే రిలీజ్ కి ముందు కొంత బజ్ వచ్చేది. అయినా ఈ స్లో కంటెంట్ తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందనుకున్నారో ?
గడిచిన కొన్ని నెలలుగా ఇలా చాలా రీమేక్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేకపోయాయి. మన తెలుగు ప్రేక్షకులు ఈ రీమేక్ సినిమాలను ముందే ఓటీటీ లో చూసేయడం కూడా ఈ అపజయాలకు కొంత కారణం అనుకోవచ్చు. నెక్స్ట్ చిరంజీవి ‘భోళా శంకర్’ , నాగార్జున ప్రసన్న కుమార్ సినిమా , ఇలా మరికొన్ని రీమేక్ సినిమాలు రాబోతున్నాయి. ఏదేమైనా కొన్ని రీమేక్ సినిమాలు మేకర్స్ మాత్రం మంచి గుణ పాఠాలు నేర్పించాయి. వీటిని అనలైజ్ చేసుకొని రాబోయే రీమేక్ సినిమాలలో మార్పులు చేసుకుంటే బెటర్ లేదంటే ఇక్కడ వర్కవుట్ అవ్వని కంటెంట్ ను డబ్బింగ్ ద్వారా తీసుకురావడం ఉత్తమం.
This post was last modified on February 7, 2023 3:23 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…