Movie News

వేసవి కళ తప్పబోతోందా?

వేసవి సీజన్ అంటే భారీ చిత్రాల సందడి ఉంటుంది. సెలవుల సమయం కావడంతో ఆ టైంలో సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి. లాంగ్ రన్ ఉంటుంది. అందుకే టాప్ స్టార్లు ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం పెద్ద హీరోల సినిమాలు మూణ్నాలుగు సమ్మర్ బరిలో ఉంటాయి. గత ఏడాది ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, ఆచార్య, ఎఫ్-3 లాంటి భారీ చిత్రాలు వేసవిలో సందడి చేశాయి.

ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా రెండో మూడో అయినా పెద్ద సినిమాలు వేసవి రేసులో ఉంటాయని ఆశించారు అభిమానులు. కానీ వారికి నిరాశ తప్పట్లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒక్కరి సినిమా కూడా 2023 వేసవిలో రావట్లేదు. ఈ సీజన్‌కే షెడ్యూల్ అయిన సలార్, భోళా శంకర్, హరిహర వీరమల్లు, మహేష్ బాబు 28.. ఒకదాని తర్వాత రేసు నుంచి తప్పుకున్నాయి. కొత్తగా ఇంకే స్టార్ సినిమా ఈ సీజన్‌కు షెడ్యూల్ కాలేదు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ఏ టాప్ స్టార్ సినిమా కూడా ఈ వేసవికి రావట్లేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్లు కూడా సమ్మర్ రేసులో లేరు. ఈసారి అన్నీ మిడ్ రేంజ్ స్టార్ల సినిమాలే రాబోతున్నాయి వేసవిలో. నాని సినిమా దసరా, రవితేజ సినిమా రావణాసుర మాత్రమే చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు. అఖిల్ సినిమా ‘ఏజెంట్’ రేంజ్ కాస్త పెద్దదే. మిగతావన్నీ ఓ మోస్తరు స్థాయి సినిమాలే.

సమంత ‘శాకుంతలం’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, గోపీచంద్ ‘రామబాణం’, నిఖిల్ ‘స్పై’, నాగచైతన్య ‘కస్టడీ’, వైష్ణవ్ తేజ్-4 లాంటి మీడియం రేంజ్ సినిమాలతోనే ఈ వేసవిలో సరిపెట్టుకోక తప్పట్లేదు. టాప్ స్టార్ల భారీ చిత్రాలేవీ వేసవిలో రాకపోవడం ఆయా హీరోల అభిమానులను నిరాశ పరిచేదే. పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సమ్మర్ కొంచెం కళ తప్పేలాగే ఉంది.

This post was last modified on February 10, 2023 9:53 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago