ఆ మధ్య బోలెడు ఆర్భాటం మధ్య గూఢచారి 2ని లాంచ్ చేయడం గుర్తుందిగా. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు కానీ మేజర్, హిట్ ది సెకండ్ కేస్ వరస సక్సెస్ ల ఊపుతో దీనికి అప్పుడే బిజినెస్ ఎంక్వయిరీలు జోరుగా ఉన్నాయి. అయితే సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా టైం పట్టేలా ఉందని ఇన్ సైడ్ టాక్. అసలు పూర్తి స్క్రిప్ట్ చేతిలో లేదని అడవి శేష్ తో పాటు దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారట. మరి ఫైనల్ వెర్షన్ సిద్ధం చేసుకోకుండా ఓపెనింగ్ ఎందుకు చేశారనే సందేహం రావడం సహజమే. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయట.
శేష్ కి నార్త్ లో మంచి మార్కెట్ వచ్చింది. ముఖ్యంగా మేజర్ తెచ్చిన గుర్తింపు చిన్నది కాదు. బిజినెస్ పెరుగుతున్న తరుణంలో కంటిన్యూగా పబ్లిక్ టాక్ తో పాటు మీడియా న్యూస్ లో ఉండటం చాలా అవసరం. గ్యాప్ వచ్చిందంటే ఉనికి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్యాన్ ఇండియా ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని గూఢచారి 2ని ప్రకటించడం వల్ల దీని గురించి క్రమం తప్పకుండా ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ షూట్ ఆలస్యమైనా సరే బడ్జెటో విజువల్ ఎఫెక్ట్సో ఏదో ఒకటి చెప్పేసి హైప్ తగ్గకుండా చూసుకోవచ్చు. గూఢచారి వెనుక గూడుపుఠాణి ఇదేనట.
ఇదంతా అధికారికంగా చెప్పింది కాకపోయినా నిప్పు లేనిదే పొగరాదుగా. పైగా గూఢచారి ఫస్ట్ పార్ట్ తీసిన శశికిరణ్ తిక్కకు బదులు బాధ్యతలు మరొకరికి ఇచ్చారు. సో ఏ చిన్న విషయంలోనూ పొరపాటు జరగకూడదు. అందుకే నెమ్మదిగా జరిగినా సరే తొందపడే ఆలోచనలో మాత్రం లేరు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తోనే త్వరలో విడుదల కాబోతున్న అఖిల్ ఏజెంట్, నిఖిల్ స్పైలు చూసి స్టోరీ పరంగా ఏమైనా పోలికలు వస్తున్నాయేమో చూసుకుని దానికి తగ్గట్టు కూడా మార్పులు చేర్పులు చేసుకునే ప్లాన్ ఉందట. కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న శేష్ చాలా ముందు చూపుతో వెళ్తున్నాడు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…