ఇప్పుడున్న ఓటిటిలకే దేనికి చందా కట్టాలో దేనికి వద్దనుకోవాలో అర్థం కాక హోమ్ ఆడియన్స్ విపరీతమైన కన్ఫ్యూజన్ లో పడిపోయారు. సరసమైన ధర ఉందని అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ కొనుకున్న టాలీవుడ్ కొత్త సినిమాల అనౌన్స్ మెంట్లు చూసి మతి పోయినంత పనైంది. సరే లోకల్ తెలుగు యాప్ ఆహాతో సర్దుకుందామంటే ఫోర్ కెలో కావాలంటే ఇంకో మూడు వందలు ఎక్స్ ట్రా కట్టమంటున్నారు. హాట్ స్టార్ ఉంటేనే క్రికెట్ లైవ్ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ప్రత్యేకమైన సిరీస్ లు ఉండే సోనీ లివ్ కావాలంటే ఇంకో సహస్రం సమర్పించుకోవాల్సిందే.
ఇవన్నీ చాలవన్నట్టు ముఖేష్ అంబానీ త్వరలో కొత్త ఓటిటి తీసుకురాబోతున్నారట. ఆల్రెడీ ఈ సంస్థకు జియో సినిమా పేరుతో యాప్ ఉంది. అందులో సన్ నెక్స్ట్ కంటెంట్ కూడా షేర్ చేసేవాళ్ళు. ఇటీవలే దాన్ని విత్ డ్రా చేసుకున్నారు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ జియోలోనే వచ్చింది. ఈ మధ్యే ముఖేష్ వయాకామ్ 18 స్టూడియోస్ ని కొన్నారు. వాళ్లదే వూట్ సెలెక్ట్ ప్లాట్ ఫార్మ్ ఉంది. వీళ్ళ దగ్గర బోలెడు కంటెంట్ ఉంది కానీ జనానికి పెద్దగా రీచ్ కావడం లేదు. ఇప్పుడీ రెండింటిని కలిపి జియో వూట్ పేరుతో అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు ముంబై మీడియా టాక్. అలా అని ఇదేమి ఆషామాషీగా ఉండదట
ఫోర్ జిలో జియో ఎలాంటి విప్లవం తీసుకొచ్చిందో అదే తరహాలో ఓటిటిలోనూ సమూల మార్పులు తెచ్చే విధంగా రిలయన్స్ పెద్ద ప్లానే వేస్తోంది. అందుకే ఎంత డిమాండ్ ఉన్నా హిందీ విక్రమ్ వేదా, భేడియాలను డిజిటల్ ప్రీమియర్ చేయలేదు. ఇవి థియేటర్లకు వచ్చి నెలలు దాటేసింది. వీటితో పాటు మరికొన్ని సౌత్ నార్త్ సినిమాలను ఒకేసారి గ్రాండ్ ఈవెంట్ ద్వారా జియో వూట్ నుంచి రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసింది. ప్రాథమికంగా ప్లాన్లు చాలా చాలా సరసమైన ధరల్లో ఉంటాయట. ముందు ఇలా అలవాటు చేసి తర్వాత వాతలు పెట్టడం చూసిందే. దీనికీ ఆలా చేస్తారేమో వెయిట్ అండ్ సీ
This post was last modified on February 7, 2023 8:24 am
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు,…
బుట్టబొమ్మ అని రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టు ఆ పదానికి న్యాయం చేకూర్చే అందంతో పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం…