సమంత తెలుగు చిత్ర పరిశ్రమను అగ్ర నాయికగా ఏలేసింది. ఇప్పటికీ ఆమె ఉందంటే ఆ సినిమాలకు ఆడియన్స్ బాగా వస్తారు. తమిళ రంగంలోనూ సక్సెస్ అయిన సమంత హిందీ రంగానికి మాత్రం వెబ్ సిరీస్ తో వెళుతోంది. గత ఏడాది రిలీజ్ అయిన సక్సెస్ ఫుల్ సిరీస్ ది ఫామిలీ మాన్ సీక్వెల్ లో సమంత నెగటివ్ రోల్ చేస్తోంది. ఇందులో ఆమె తీవ్రవాదిగా కనిపించి సర్ప్రయిజ్ చేస్తుందని అంటున్నారు.
వెబ్ సిరీస్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పని సమంత మరి తెలుగులో కూడా సిరీస్ లు చేస్తుందా? ఫ్యామిలీ మాన్ సిరీస్ కి సౌత్ లో ఫాలోయింగ్ రావాలని సమంతను స్ట్రాటజీ ప్రకారం పెట్టుకున్నారు. ఇందుకోసం ఆమెకు మంచి పారితోషికమే ఇచ్చినట్టు సమాచారం.
తెలుగు నిర్మాతలు కూడా త్వరలో భారీ ఎత్తున ఓటిటి కంటెంట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఓటిటి కోసం తీసే వాటిలో సమంత లాంటి స్టార్స్ ఉంటే వాటి రీచ్ బాగా పెరుగుతుంది. మరి రీజినల్ కంటెంట్ కి సమంత సపోర్ట్ ఉంటుందా లేక అది హిందీకి మాత్రమే పరిమితమా అనేది తెలియాలి.
This post was last modified on July 23, 2020 4:00 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…