Movie News

అల్లు మీటింగ్ క్యాన్సిల్ – అసలేం జరుగుతోంది

టాలీవుడ్ లో వాడివేడిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయాన్నే అల్లు అరవింద్ నుంచి మీడియాకు ప్రెస్ మీట్ కు రమ్మని ఆహ్వానం అందింది. ముందు బాలయ్య నర్సుల కామెంట్ వివాదమేమో అనుకున్నారు. తీరా చూస్తే అది కాదు నిన్న దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబోలో దిల్ రాజు అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గురించని మరో లీక్ వచ్చింది. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన అరవింద్ చాలా ఆగ్రహంగా ఉన్నారని ఎన్నో విషయాలపై కుండ బద్దలు కొట్టబోతున్నారని భావించిన జర్నలిస్టులు దానికి సిద్ధమవుతుండగానే మళ్ళీ క్యాన్సిల్ అంటూ సందేశం రావడం మరో షాక్.

ఫైనల్ గా సమావేశం రద్దు చేశామని తేల్చేశారు. అంతా ప్రశాంతంగా ఉన్న టైంలో టీ కప్పులో తుఫాను లాగ ఇప్పుడీ కాంట్రావర్సీ తలెత్తితే దాని వల్ల పరిణామాలు కష్టంగా ఉంటాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ విన్నపం చేయడం వల్లే అరవింద్ వెనక్కు తగ్గారనే మాట వినిపిస్తోంది. గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ ని పక్కన పెట్టేసి దిల్ రాజుకి కమిట్ కావడం ఇప్పుడీ వివాదానికి దారి తీసిందని వినికిడి. గతంలో పివిపికి వంశీ పైడిపల్లికి ఏదైతే ఇష్యూ వచ్చిందో అచ్చంగా అదే ఇప్పుడూ రిపీట్ అయ్యిందని ఫిలిం నగర్ టాక్.

ఇందులో నిజానిజాలు స్పష్టంగా తెలిసింది అల్లు అరవింద్, దిల్ రాజు,పరశురామ్, విజయ్ దేవరకొండలకే. తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టు తీసుకోవడం ఏమిటనేది గీతా వర్గాల వాదన. అయితే ఇక్కడ స్పష్టత కొరవడుతోంది. ఏది అఫీషియల్ గా బయటికి రావడం లేదు. అంతా లోలోపలే మాట్లాడుకుంటున్నారు. లీక్స్ రూపంలో విషయాలు తెలిసిపోతున్నా తప్పని ఒప్పని ఏదీ చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. సాధ్యమైనంత వివాదాలకు దూరంగా ఉంటారని పేరున్న అల్లు అరవింద్ హీరో దర్శకుడి ప్రవర్తన వల్లే సహనం కోల్పోయారనే కామెంట్ కూడా ఉంది. దేన్నీ నిర్ధారించలేం కానీ ఈ స్థాయి ప్రచారానికి ఎవరో ఒకరు అధికారికంగా చెక్ పెట్టడం అవసరం.

This post was last modified on February 6, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago