Movie News

బడ్జెట్ మరీ డబులైపోవడమేంటో..

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘దసరా’కు సంబంధించి ఆర్థిక విషయాలు ఈ మధ్య చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన నాని సినిమాకు 30 కోట్లు అంటే సేఫ్ బడ్జెట్. అతడి సినిమాలకు రూ.50 కోట్ల దాకా బిజినెస్ గ్యారెంటీ అన్నట్లుండేది పరిస్థితి. ఐతే కొన్నేళ్లుగా నాని నిలకడగా విజయాలు సాధించకపోయినా, పెద్ద హిట్లేమీ కొట్టకపోయినా, తన చివరి చిత్రం ‘అంటే సుందరానికీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఫ్లాప్‌గా నిలిచినా.. ‘దసరా’ చిత్రానికి బడ్జెట్ రూ.35 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయాడు నిర్మాత సుధాకర్ చెరుకూరి.

ఆయన గత చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. ఈ సినిమా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోయాడు. ఐతే ఒక సినిమా మొదలయ్యే ముందు ఒక బడ్జెట్ అనుకుంటారు కానీ.. తర్వాత ప్రణాళిక ప్రకారం ఏదీ జరగదు. బడ్జెట్ కొన్ని కోట్లు పెరగడం మామూలే.

ఆ రకంగా చూస్తే ఐదు కోట్లో పది కోట్లో బడ్జెట్ పెరిగితే అర్థం చేసుకోవచ్చు. కానీ ‘దసరా’ చిత్రానికి ఏకంగా బడ్జెట్ రెట్టింపు అయిపోవడం షాకింగ్. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రణాళిక ప్రకారం సినిమాను తీయలేకపోయాడా.. లేక క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, సినిమా పెద్ద రేంజికి వెళ్లే ఛాన్సుందని అదనంగా ఖర్చు పెట్టుకుంటూ పోయారా, బిజినెస్ ఆఫర్లు చూసి టెంప్ట్ అయ్యారా అన్నది తెలియదు కానీ.. బడ్జెట్ ముందు అనుకున్నదానికంటే దాదాపు రెట్టింపు అయ్యిందట.

ఇండస్ట్రీలో ఇతరులకు చెబుతున్న, మీడియా వాళ్లతో అంటున్న ప్రకారం ‘దసరా’ బడ్జెట్ ఏకంగా రూ.65 కోట్లట. నాని ఒక్కడికే రూ.15 కోట్ల దాకా ఇస్తున్నట్లు సమాచారం. కీర్తి కూడా స్టార్ హీరోయిన్ కావడం, పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేయడం.. వర్కింగ్ డేస్ కూడా బాగా పెరిగిపోవడంతో బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోయింది. కాకపోతే ఇంత బడ్జెట్ పెట్టి కూడా రిలీజ్ ముంగిట నిర్మాత రూ.15 కోట్ల దాకా లాభంలో ఉండడం విశేషం. అన్ని హక్కులూ కలుపుకుని ఈ చిత్రానికి రూ.80 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

This post was last modified on February 6, 2023 5:23 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

20 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago