ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటిస్తుందనేది ఈ వారంలో అతి పెద్ద వార్తల్లో ఒకటి. ఈ వార్తను అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేసిందంటే చూసుకోండి. అయితే ఈ చిత్రంలో నటించడానికి దీపిక ముప్పై కోట్లు డిమాండ్ చేసిందనే వార్తలు వచ్చాయి.
నిజానికి ప్రభాస్ తో సమానమయిన పారితోషికం ఇవ్వాలని, స్త్రీ సమానత్వం ఇక్కడే చూపించాలని దీపిక అడిగిందట. అయితే ప్రభాస్ కి ఇచ్చే యాభై కోట్ల పారితోషికం దీపికకు ఇవ్వడం అసాధ్యం కనుక… ఇంత వరకు ఆమె అందుకోనంత పారితోషికం ఆఫర్ చేశారట. అలా దీపికకు ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అనధికారిక సమాచారం. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ ఘనత దీపిక దక్కించుకుందట.
కథాపరంగా హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడంతో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే చేస్తానని కండిషన్ పెట్టిందట. అందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ అంగీకరించాడని, హీరోయిన్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచుతున్నాడని టాక్. మొత్తానికి ఒక సౌత్ హీరోతో నటించడానికి దీపిక వివిధ కండిషన్స్ తో తనకు కావాల్సింది చేసుకుందన్నమాట.
This post was last modified on July 23, 2020 4:06 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…