పెద్దగా గుర్తింపు లేని చిన్న హీరోల సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు టైమింగ్ చాలా కీలకం. ముందు వెనుక చూసుకోకుండా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి దెబ్బేయొచ్చు. ఆ మధ్య బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం కేవలం ఈ కారణంగానే బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. రూపం టాలెంట్ రెండూ ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోల్లో సంతోష్ శోభన్ ఒకరు. ఇతని కొత్త మూవీ శ్రీదేవి శోభన్ బాబుని ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. దీని టీజర్ అప్పుడెప్పుడో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదిలిన సంగతి జనాలు ఎప్పుడో మర్చిపోయారు.
మెగాస్టార్ తనయ సుస్మిత కొణిదెల తీసిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. కమ్రాన్ సంగీతం అందించారు. టైటిల్ కు తగ్గట్టే ఇది తొంభై దశకంలో సాగుతుంది. అంతా బాగానే ఉంది కానీ హఠాత్తుగా ఈ డేట్ ని ప్రకటించడం వెనుక స్ట్రాటజీ ఏంటో అంతు చిక్కడం లేదు. 17న ధనుష్ సర్ వస్తోంది. సితార బ్యానర్ కాబట్టి పెద్ద ప్లానింగ్ ఉంటుంది. అదే రోజు కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథను తెస్తున్నారు. దీనికి నెల రోజులుగా ప్రమోషన్ జరుగుతూనే ఉంది. వీటి మీద ఓ మోస్తరుగా పర్వాలేదనిపించే బజ్ అయితే కనిపిస్తోంది.
వారం ముందు వచ్చే కళ్యాణ్ రామ్ అమిగోస్ కి సెకండ్ వీక్ థియేటర్లు గట్టిగానే హోల్డ్ చేస్తారు. అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదాని 17నే దించుతున్నారు. ఇంత పోటీ మధ్య అసలే అంచనాలు లేని శ్రీదేవి శోభన్ బాబు నెగ్గుకురావడం సవాలే. సంక్రాంతికి కళ్యాణం కమనీయంని దింపి అవసరం లేని రిస్క్ చేసిన సంతోష్ శోభన్ కు ఆల్రెడీ ఒక డిజాస్టర్ ఉంది. దానికి ముందు వచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దారుణంగా బోల్తా కొట్టింది. మారుతీ తీసిన మంచిరోజులు వచ్చాయి కూడా ఇదే ఫలితమే. అలాంటప్పుడు రైటర్ పద్మభూషణ్ లాగా ఏదైనా మంచి స్లాట్ చూసుకుంటే బాగుండేది. అంత నమ్మకమేంటో మరి.
This post was last modified on February 6, 2023 10:30 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…