బాలీవుడ్ నవతరం నటుల్లో చాలా తక్కువ సమయంలో లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గానే కాక కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్‌తోనూ అతను అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు ఇచ్చాడు.
ఐతే ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా అతడి ఫిలిం కెరీర్ కూడా కొంచెం డౌన్ అయింది. ఇంతకముందులా తరచుగా సినిమాలు చేయట్లేదు నవాజ్. భార్య ఆలియాతో గొడవ రోజు రోజుకు శ్రుతిమించుతుండడంతో ఇప్పుడతను తన ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్లో ఉంటుండడం గమనార్హం. ఆలియా చాన్నాళ్ల నుంచి నవాజ్‌కు దూరంగా ఉంటోంది.
ఐతే ఆమె ఇటీవల దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పాస్ పోర్ట్ సమస్య కారణంగా వెళ్లలేకపోయింది. దీంతో తిరిగి ఆమె నవాజ్ ఇంటికి వచ్చింది. ఐతే ఆలియాకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదంటూ నవాజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ నవాజ్ నుంచి తనకు ఇంకా విడాకులు రాలేదని, అలాంటపుడు తాను అతడి ఇంట్లో ఎందుకు ఉండకూడదని ఆమె వాదించింది. నవాజ్ తల్లి వేధిస్తోందని పోలీసులకు రివర్సులో ఫిర్యాదు చేసింది. నవాజ్ ఇంట్లో తనకు సరిగా తిండి పెట్టట్లేదని.. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.
ఇలా గొడవ పెద్దది కావడంతో నవాజ్ తన ఇంటి నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ తేలి, ఆలియా నుంచి తాను విడాకులు పొందే వరకు ఇంటికి వెళ్లకూడదని నవాజ్ నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా అతను హోటల్లోనే ఉండబోతున్నాడట. నవాజ్ ఇటీవలే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను రూపొందించనున్న తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 6, 2023 6:28 am
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…