కంగనా రనౌత్ ట్విట్టర్లో ఉన్నన్ని రోజులు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఓవైపు బాలీవుడ్ సెలబ్రెటీలు, మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.
ఐతే ఒక దశ దాటాక తన పోస్టులు మరీ వివాదాస్పదం కావడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్‌ని సస్పెండ్ చేసింది. కానీ ఇటీవలే ఆమె అకౌంట్‌ను పునరుద్ధరించారు. ఇక అప్పట్నుంచి వివాదాలకు దూరంగా.. ఎక్కువగా పాజిటివ్ ట్వీట్లే వేస్తూ వచ్చింది కంగనా.
షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాను పొగడ్డం.. పెళ్ళికి సిద్ధమైన సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జోడీని కొనియాడడం లాంటి తనకు సూట్ కాని పనులతో ఆశ్చర్యపరిచింది కంగనా. ఐతే ఇప్పుడు తన పాత స్టయిల్లోకి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.
తన వెనుక కుట్ర జరుగుతోందని, తనపై గూఢచర్యం చేస్తున్నారని కంగనా ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఆమె ఒక లెంగ్తీ ఇన్‌స్టా పోస్టు పెట్టింది. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా నన్ను ఫాలో అవుతున్నారు. నాపై గూఢచర్యం చేస్తున్నారు. వీధుల్లోనే కాక బిల్డింగ్ పార్కింగ్, నా ఇంటి టెర్రస్‌లో కూడా వాళ్లు నా కోసం జూమ్ లెన్స్ ఏర్పాటు చేశారు. ఉదయం ఆరున్నరకి నా ఫొటోలు తీశారు. వాళ్లకు నా షెడ్యూల్ ఎలా తెలుస్తోంది? ఆ ఫొటోలను వాళ్లేం చేస్తారు? నా వాట్సాప్ డేలా, ప్రొఫెషనల్ కాంట్రాక్టులు, వ్యక్తిగత వివరాలు అన్నీ లీక్ అవుతున్నాయని నమ్ముతున్నా’’ అని కంగనా ఆరోపించింది.
ఆమె పరోక్షంగా రణబీర్ కపూర్, ఆలియా భట్‌లను ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. పేరు పెట్టకుండా వారి గురించి పరోక్షంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒకప్పుడు నా ఆహ్వానం లేకుండా నా ఇంటి వద్దకు వచ్చి నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు అతడి భార్యను నిర్మాతగా మార్చాలని చూస్తున్నాడు. నాలాగా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని, నాలాగా దుస్తులు ధరిస్తూ అనుకరించమని అంటున్నాడు. వాళ్లు నా స్టైలిస్ట్, హోం స్టైలిస్ట్‌లను కూడా హైర్ చేసుకున్నారు. నా ఫైనాన్షియర్లు, బిజినెస్ పార్టనర్స్ ఎలాంటి కారణం లేకుండా చివరి నిమిషంలో కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారు. అతను నన్ను ఒంటరిని చేసి, మానసికంగా ఒత్తిడికి గురి చేయాలని చూస్తున్నాడు’’ అని కంగనా పేర్కొంది.
This post was last modified on February 6, 2023 6:17 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…