భారతీయ సినిమా పాటను అత్యున్నత శిఖరాలకు చేర్చిన గాయనుల్లో ఒకరు వాణీ జయరాం. అమృతం గొంతులో నింపుకున్నట్లుగా తన గానంతో ఆమె సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 19 భాషల్లో 11 వేల పాటలు పాడిన అరుదైన గాయని ఆమె. ఇటీవలే ఆమెను భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ కూడా వరించింది. ఆమె అభిమానులకు అమితానందాన్ని అందించిన విషయమిది.
ఐతే ఆ పురస్కారం అందుకున్న సమయంలో ఆరోగ్యంగానే కనిపించిన వాణీ జయరాం.. కొన్ని రోజులకే ఇలా కన్నుమూయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆది సహజ మరణం కాదని స్పష్టమవుతోంది. ఆమె ఏ స్థితిలో మరణించిందో తెలుసుకుని అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అంతటి దిగ్గజ గాయనికి ఈ దుస్థితి ఏంటా అని మథన పడుతున్నారు.
వాణీ జయరాంకు పిల్లలు లేరు. ఆమె భర్త ఐదేళ్ల కిందట మరణించారు. ఒకప్పుడు వెలుగు జిలుగుల జీవితం చూసిన ఆమె కొన్నేళ్ల నుంచి ఆదరించేవారు లేక చెన్నైలోని తన ఇంటిలో ఒంటరి జీవితం గడుపుతున్న విషయం మరణించాకే చాలామందికి తెలిసింది. ఒక పనిమనిషి మినహా ఆమెను చూసుకోవడానికి సొంత వాళ్లంటూ ఎవరూ లేరట.
78 వయసులో ఒంటరి జీవనం గడుపుతూ అనుకోకుండా ఇంట్లో కింద పడడం.. గ్లాస్ టేబుల్ తగిలి గాయం కావడం ఆమె మరణానికి దారి తీసింది. గాయపడ్డపుడు సమయానికి ఇంట్లో పని మనిషి కూడా లేకపోవడంతో సాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం అరణ్య రోదనే అయింది. చివరికి అలాగే ఆమె కన్ను మూసింది. రక్తసిక్తమైన ఆమె పార్థివ దేహాన్ని పోలీసులు బెడ్ షీట్‌లో చుట్టి తీసుకురావాల్సిన పరిస్థితి తెలిసింది. ఇదంతా తెలుసుకున్న అభిమానులు ఈ మధుర గాయనికి చివరికి ఇలాంటి పరిస్థితి తలెత్తిందేంటని వేదనకు గురవుతున్నారు.
This post was last modified on February 5, 2023 7:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…