పాత సినిమాల రీ రిలీజుల ప్రహసనం కొనసాగుతోంది. సంక్రాంతి టైంలో వీటి హడావిడి తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు రీ స్టార్ట్ చేశారు. అయితే ఈసారి పూర్తి వెనక్కు వెళ్ళిపోయి 1991 మెగాస్టార్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ ని థియేటర్లలో తీసుకొస్తున్నారు. అయితే ఇంత పాత సినిమా అది కూడా యూట్యూబ్ వందల ఛానల్స్ లో అందుబాటులో ఉన్న దాన్ని విడుదల చేస్తే జనం చూస్తారా అనేది అనుమానంగానే ఉంది. ఇది వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ ని క్యాష్ చేసుకోవడానికే తప్పించి మరో కారణం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పైగా ఇప్పటి టికెట్ రేట్లతో వర్కౌట్ అవుతుందానేది డౌట్.
ఇదంతా పక్కనపెడితే గ్యాంగ్ లీడర్ చిరంజీవి కెరీర్ టాప్ ఫైవ్ మూవీస్ లో ఈజీగా చోటు దక్కించుకునే ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథలో కమర్షియల్ అంశాలను అద్భుతంగా జోడించి దర్శకులు విజయ్ బాపినీడు దీన్ని తీర్చిదిద్దిన తీరు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. బప్పీలహరి స్వరపరిచిన పాటలు అప్పట్లో లహరి ఆడియో క్యాసెట్ కంపెనీకి లక్షల రూపాయల లాభం ఆర్జించి పెట్టింది. చిరు విజయశాంతిల హుషారైన జంట, కిక్కిచ్చే డాన్సులు, విజిల్స్ వేయించే ఫైట్లు వెరసి గ్యాంగ్ లీడర్ ఒక కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అన్న మాట నిజమే.
కానీ ఇప్పటి యూత్ దీనికి ఎంత మేరకు కనెక్ట్ అవతారనేది చెప్పలేం. పైగా టీవీలో ఆన్ లైన్లో బోలెడు సార్లు చూశాక మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసేందుకు వస్తారానేది వేయి డాలర్ల ప్రశ్న. ఆ మధ్య ఘరానా మొగుడుని ఇలాగే విడుదల చేస్తే ప్రింట్ నాణ్యత లేక ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 4కె జమానాలో నాసిరకం క్వాలిటీ ఉంటే పబ్లిక్ ఒప్పుకోవడం లేదు. అందుకే గ్యాంగ్ లీడర్ కి క్వాలిటీ చాలా ముఖ్యం. ఫిబ్రవరి 11న రాబోతున్న గ్యాంగ్ లీడర్ కు ఒక్క రోజు ముందు కళ్యాణ్ రామ్ అమిగోస్ రిలీజ్ కానుంది. దాని తాకిడిని తట్టుకుని చిరు ఎలాంటి పోటీ ఇస్తారో చూడాలి.
This post was last modified on February 5, 2023 7:33 pm
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…