లైగర్ డిజాస్టర్ దెబ్బ విజయ్ దేవరకొండకు మాములుగా తగల్లేదు. వ్యక్తిగతంగా ఇమేజ్ ని ప్రభావితం చేయడంతో పాటు ప్రీ రిలీజ్ టైంలో అతిశయోక్తిగా అన్న మాటలన్నీ బ్యాక్ ఫైర్ కావడంతో స్వీయ విశ్లేషణ చేసుకుని ఈ మధ్య కొంత స్లో అయ్యాడు. సమంతా ఎప్పుడెప్పుడు వస్తుందా ఖుషి ఎప్పుడు పూర్తి చేద్దామా అని ఎదురు చూస్తున్న రౌడీ హీరో ఇటీవలే హీరోయిన్ లేని సీన్స్ తో రీ షూట్ మొదలుపెట్టాడు. ఆ మేరకు దర్శకుడు శివ నిర్వాణ నిన్నో అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు ఈ కూల్ లవ్ స్టోరీ మీదే గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ఇతర హీరోలు వద్దనుకున్న దర్శకులను ఎంచుకోవడంలోని ఉద్దేశం అర్థం కాక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఓకే చేయించుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పించుకున్న గౌతమ్ తిన్ననూరి ఫైనల్ వెర్షన్ తో మెప్పించలేక బయటికి వచ్చాడు. కట్ చేస్తే ఓ పోలీస్ బ్యాక్ డ్రాప్ కథతో రౌడీ బాయ్ ని ఒప్పించేసి సితార లాంటి పెద్ద సంస్థలో పాగా వేశాడు. సర్కారు వారి పాట తర్వాత నాగ చైతన్యతో ఓ సినిమా కోసం విశ్వప్రయత్నం చేసిన పరశురామ్ పేట్ల తను తయారు చేసుకున్న నాగేశ్వరరావు స్టోరీతో మెప్పించలేకపోయాడు.
కట్ చేస్తే ఇప్పుడు ఇదే పరశురామ్ నిర్మాత దిల్ రాజుతో చేతులు కలిపి విజయ్ దేవరకొండకు లాక్ చేసుకున్నాడని లేటెస్ట్ అప్ డేట్. అఫీషియల్ గా రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడిగా పరశురామ్ మీద విజయ్ కు మంచి కార్నర్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే చరణ్, చైతులు వద్దనుకున్న వాటినే దేవరకొండ చేస్తున్నాడా లేక ఫ్రెష్ గా వేరే సబ్జెక్టులు ఓకే చేశాడా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవైపు సుకుమార్ తో చేయాల్సిన మూవీ చేజారిపోయిన తరుణంలో ఈ టైపు ప్లానింగ్ కరెక్టే. కేవలం ముందు వాటి ఫలితాల ఆధారంగా డైరెక్టర్ల క్యాలిబర్ అంచనా వేయలేంగా.
This post was last modified on February 5, 2023 7:25 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…