అఖిల్ ఆ ఇద్దరినీ కాచుకోవాలి

అక్కినేని ఫ్యాన్స్ కళ్ళలో ఫ్లడ్ లైట్లు వేసుకుని ఎదురు చూస్తున్న ఏజెంట్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 28 ఫిక్స్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు సంతోషం. అభిమానులకు చిన్న కానుకగా టీజర్ రూపంలో అఖిల్ మొహమంతా రక్తం పూసుకుని వార్నింగ్ ఇచ్చే వీడియో ఒకటి వదిలారు. దాని మీద మిశ్రమ స్పందన వస్తోంది అది వేరే సంగతి. విడుదల ఫిక్స్ చేసుకున్నంత మాత్రాన అంతా హ్యాపీస్ కాదు. అఖిల్ కు బాక్సాఫీస్ వద్ద పెద్ద సవాళ్ళే ఎదురు కాబోతున్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియా గ్రాండియర్లకు వీలైనంత పోటీ లేని సోలో రిలీజ్ చాలా అవసరం. కానీ ఏజెంట్ కు అంత ఈజీ వెల్కమ్ దొరికే సూచనలు తక్కువే.

ఎందుకంటే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 అదే డేట్ ని ఎప్పుడో లాక్ చేసుకుంది. అసలు కథ, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయని యూనిట్ మొదటి నుంచి ఊరిస్తోంది. సో ఫస్ట్ పార్ట్ తెలుగులో గొప్పగా ఆడకపోయినా సీక్వెల్ కనక కనెక్ట్ అయితే హిట్టయ్యే ఛాన్స్ లేకపోలేదు. పైగా ఇక్కడ పంపిణీ చేసేది దిల్ రాజు కాబట్టి స్క్రీన్ కౌంట్ గట్టిగానే వస్తుంది. తమిళనాడులో ఈ పీఎస్ 2 వల్ల ఏజెంట్ కి సరైన రిలీజ్ దక్కకపోయే ప్రమాదం ఉంది. అఖిల్ సినిమాలో ఎంత మమ్ముట్టి ఉన్నా కేరళలోనూ పొన్నియన్ సెల్వన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మల్టీ స్టారర్ కావడమే కారణం.

లక్కీగా కరణ్ జోహార్ బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని జూలైకి వాయిదా పడింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే కాంపిటీషన్ ఇంకా తీవ్రంగా ఉండేది. అయితే ఏప్రిల్ 29న పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రంని గతంలోనే ప్రకటించారు. ఇదేమి హీరో రేంజ్, మార్కెట్ పరంగా ఏజెంట్ కి సమానంగా నిలిచేది కాదు కానీ దాని మేకింగ్, కంటెంట్ గురించి యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ చూస్తుంటే తక్కువ అంచనా వేయడానికి లేదనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం అఖిల్ ఒకపక్క మణిరత్నంని మరోపక్క వైష్ణవ్ ని కాచుకుని వాళ్లపై గెలవాలి. సూరి ఎలా చూపిస్తాడో మరి