కొన్ని కాంబినేషన్లలో సినిమాలను ఘనంగా ప్రకటిస్తారు. కానీ అవి అవి ఉన్నట్లుండి బ్రేక్ అయిపోతుంటాయి. టాలీవుడ్లో అలాంటి ఉదంతాలు బోలెడుతున్నాయి. ఇప్పుడు తమిళంలో ఒక క్రేజీ కాంబినేషన్ క్యాన్సిల్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. తమిళంలో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే టాప్ స్టార్లలో ఒకడు అజిత్. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోటి అతను ఓకే చేసేస్తుంటాడు.
తన చివరి సినిమా ‘తునివు’ షూటింగ్ చివరి దశలో ఉండగా అతను నయనతార భర్త, యువ దర్శకుడు విఘ్నేష్ సినిమాతో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు. కానీ ‘తునివు’ రిలీజై ఇక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్న దశలో కథ మలుపు తిరిగింది. విఘ్నేష్‌తో సినిమాను అజిత్ క్యాన్సిల్ చేసేసినట్లు తెలుస్తోంది.
విఘ్నేష్ ఫుల్ స్క్రిప్టుతో అజిత్‌ను మెప్పించలేకపోయాడని.. వీరి కలయికలో సినిమా రావడం కష్టమే అని కొన్ని రోజుల కిందటే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమని తేలిపోయింది. తన ట్విట్టర్ బయోలో ఇంతకుముందు పేర్కొన్న తన సినిమాల జాబితాలో #AK62 అని కూడా పెట్టుకున్నాడు విఘ్నేష్. తాజాగా ఆ పేరును తొలగించాడు. కాబట్టి అజిత్ కొత్త సినిమా నుంచి అతను వైదొలిగాడన్నది స్పష్టం.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి షూట్ మొదలు కావాల్సింది. కానీ కొంచెం లేటుగా విఘ్నేష్ సినిమా క్యాన్సిల్ కావడంతో అజిత్ హడావుడిగా వేరే ఆప్షన్లు చూస్తున్నాడు. తెలుగులోకి ‘రెడ్’ పేరుతో రీమేక్ అయిన ‘తడం’ సినిమా తీసిన మగిల్ తిరుమనితో అజిత్ జట్టు కట్టే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వేరే కొందరు స్టార్ డైరెక్టర్లు కూడా అజిత్‌తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on February 4, 2023 5:45 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…