Movie News

8 నెలల ముందే బెనిఫిట్ షో టికెట్లు

మాములుగా స్టార్ హీరోల క్రేజ్ గురించి తెలిసిందే. ఓ రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం సర్వసాధారణం. కానీ సినిమా నిర్మాణం పూర్తిగా మొదలుకాకుండా, అసలు రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియకుండా ఫ్యాన్స్ అసోసియేషన్లు టికెట్లు కొనడం మాత్రం ఖచ్చితంగా ఎనిమిదో వింతే. విజయ్ అభిమానులు మేము స్పెషల్ అని ప్రూవ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తో ఇతను ప్రస్తుతం లియో చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న వచ్చిన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తోంది. అప్పుడే దీనికి బుకింగ్స్ మొదలుపెట్టేశారు.

కేరళలోని అలపుజ్జా జిల్లా కేంద్రంలో లియో పేరుని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే బెనిఫిట్ షో టికెట్లు అమ్మకానికి పెడితే క్షణాల్లో అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీపావళి విడుదల ఎలాగూ కన్ఫర్మ్ చేశారు కానీ తేదీ క్లారిటీ లేకపోయినా ఫలానా సీజన్ అని తెలిసిపోయింది కాబట్టి ముందస్తు ఏర్పాటు అన్న మాట. దీని ప్రకారం అలపుజ్జాలో మొదటి ఆట ఏ టైంకు పడినా దాని తాలూకు టికెట్లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందట. ధర వెయ్యి నుంచి రెండు వేల రూపాయల మధ్యలో పలికినట్టు టాక్. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించినా తమిళ హీరోల మీద పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇది సాక్ష్యం.

టాలీవుడ్లో మరీ ఇంత విపరీత స్థాయిలో లేకపోవడం సంతోషమే అయినా ట్విట్టర్ వేదికగా పరస్పరం బురద జల్లుకునే యాంటీ ఫ్యాన్స్ కి మన దగ్గరా కొదవ లేదు. కాకపోతే నెలల ముందే డబ్బులు ఖర్చు పెట్టుకుని టికెట్లు కొనాల్సిన అవసరం పడలేదు. అయినా ఉదయాన్నే షోలు వేసేందుకు తగినన్ని థియేటర్లు ఉండగా ఇప్పుడే ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారంటే అజిత్ కంటే తమ హీరో అన్నింటిలోనూ ఓ మెట్టు పైన ఉన్నాడని చెప్పుకునే తాపత్రయంలా కనిపిస్తోంది. ఇటీవలే వారసుడు తెగింపులతో తలపెడితే ఏరియాలను బట్టి ఇద్దరూ సమానంగానే ఆధిపత్యం చెలాయించారు

This post was last modified on February 4, 2023 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago