మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు ‘వాల్తేరు వీరయ్య’ మంచి ఊపునే ఇచ్చింది. ‘ఆచార్య’ డిజాస్టర్ అయి, ‘గాడ్ ఫాదర్’ యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకోవడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరు నెమ్మదిగా మార్కెట్ కోల్పోతున్నాడనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. ఇప్పటి యూత్ ఆయనకు కనెక్ట్ కావట్లేదేమో అన్న చర్చ కూడా నడిచింది. కానీ ‘వాల్తేరు వీరయ్య’ ఆ తరం ఈ తరం అని తేడా లేకుండా అందరినీ అలరించింది. చిరు ఛార్మ్ ఇంకా తగ్గలేదని రుజువు చేసింది.
ఐతే ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చిన మాట వాస్తవం. పండుగ టైంలో ఓ మోస్తరుగా ఉన్నా సరే పెద్ద సినిమాలు భారీ వసూళ్లు తెచ్చుకుంటాయి. పైగా పోటీలో ఉన్న చిత్రాల్లో అన్నిటికంటే బెటర్ మూవీ కావడం కూడా ‘వాల్తేరు వీరయ్య’కు కలిసొచ్చింది. మొత్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది.
ఐతే ఈ సినిమాను బట్టి చిరు సత్తాను అంచనా వేయలేం. దీన్నే ప్రామాణికంగా చూడలేం. చిరు అసలు సత్తా ఏంటో రుజువు చేసేది ‘భోళా శంకర్’యే. ఎందుకంటే ఆ చిత్రానికి సంబంధించి ఏదీ సానుకూలంగా కనిపించడం లేదు. ఈ రోజుల్లో రీమేక్ మూవీ అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండట్లేదు. పైగా అది చాలా రొటీన్‌గా సాగే ఒక పాత సినిమాకు రీమేక్. ఇది చాలదని అస్సలు ఫాంలో లేని, ఔట్ డేటెడ్ ముద్ర వేయించుకున్న మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇలాంటి సినిమా అద్భుతాలు చేస్తుందని ఎవరికీ అంచనాలు లేవు.
‘గాడ్ ఫాదర్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన వసూళ్లు రాబట్టలేదంటే అందుక్కారణం రీమేక్ అంటే జనాల్లో ఉన్న నిరాసక్తత. ‘భోళా శంకర్’ విషయంలోనూ ఆ రకమైన నిరాసక్తత ఉంది. మరి ‘వాల్తేరు వీరయ్య’తో వచ్చిన ఊపును ఉపయోగించుకుని ‘భోళా శంకర్’కు కూడా జనాలను ఆకర్షించి, తన చరిష్మాతో ఆ చిత్రాన్ని చిరు నిలబెడతాడేమో చూడాలి.
This post was last modified on February 3, 2023 9:45 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…