మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్ హీరోల సినిమాలు ఏవైనా సరే.. మిగతా ఏరియాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో ఎక్కువ బాగా ఆడతాయి. ఆ ఏరియాలో మెగా హీరోల సినిమాలకు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయి. చిరుకు ముందు నుంచి అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు అక్కడ గతంలో అనేక రికార్డులు నెలకొల్పాయి.
చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా’ సైతం అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. ఐతే ఆ తర్వాత ‘ఆచార్య’ మాత్రం అన్ని ప్రాంతాల్లో మాదిరే అక్కడా చతికిలపడింది. మళ్లీ ‘గాడ్ ఫాదర్’ ఓకే అనిపించింది. ఐతే దీని తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో మామూలుగా ఆడలేదు.
ఈ సినిమా కథ కూడా వైజాగ్‌లో జరిగేది కావడం.. చిరు ఇందులో ఉత్తరాంధ్ర యాస మాట్లాడ్డంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఉత్తరాంధ్రలో మంచి ఊపు చూపించిన ‘వాల్తేరు వీరయ్య’.. విడుదల రోజు నుంచి ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది. సినిమా మిగతా ఏరియాల్లో కూడా బాగా ఆడినా సరే.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మాత్రం టికెట్ ముక్క దొరకడం కష్టమైంది.
తొలి వీకెండ్లో డిమాండ్ అంతకంతకూ పెరిగి వేరే సినిమాలకు కొంచెం తగ్గించి దీనికి స్క్రీన్లు, షోలు పెంచాల్సి వచ్చింది. వీకెండ్ తర్వాత అన్ని చోట్లా వసూళ్లలో డ్రాప్ కనిపించగా.. వైజాగ్ ఏరియాలో మాత్రం మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది సినిమా. ఇప్పుడు రిలీజై మూడు వారాలు దాటినా వీకెండ్లో ఈ చిత్రానికి ఇక్కడి థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్ పడేలా ఉన్నాయి. మంచి షేర్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం వైజాగ్ ఏరియాలో రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on February 4, 2023 12:10 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…