కొంత కాలం సక్సెస్ కి దూరంగా ఉండి ఇటీవలే బింబిసార బ్లాక్ బస్టర్ తో గట్టి కంబ్యాక్ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అమిగోస్ ఈ నెల 10న విడుదల కానుంది. తారకరత్న ఆరోగ్యం గురించి కొంత అనిశ్చితి ఉన్న నేపథ్యంలో వాయిదా పడొచ్చన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ నిర్మాతలు డేట్ ని మార్చకుండా అదే అఫీషియల్ గా ట్రైలర్ లో ప్రకటించారు. కర్నూలు వేదికగా కళ్యాణ్ రామ్ తో పాటు టీమ్ హజరవ్వగా శ్రీరామ థియేటర్ లో లాంచ్ వేడుక జరిపారు. సాధారణంగా హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ కి భిన్నంగా ఈసారి రాయలసీమని ఎంచుకోవడం విశేషం.
కథేంటో క్లుప్తంగా రివీల్ చేశారు. అన్న దమ్ములు కవలలు కానివాళ్ళు ఒకే పోలికలో ఉండటం అరుదు. అలా ఎదురు పడితే ప్రమాదం కూడా. దేశ విదేశాలలో పోలీసులను, ఇండియాలో ఎన్ఐఏను వణికించే ఇంటర్నేషనల్ క్రిమినల్(కళ్యాణ్ రామ్) లాగా మరో ఇద్దరు మన దేశంలోనూ ఉంటారు. ముందు వాళ్ళతో స్నేహంతో నటిస్తూ పంచన చేరిన ఆ మాఫియా డాన్ తర్వాత తన అసలు రూపం బయట పెడతాడు. దీంతో మంచివాళ్ళైన మిగిలిన ఇద్దరి(కళ్యాణ్ రామ్)ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అసలు ఈ ఉచ్చు ఎలా ఏర్పడింది, ఎవరు ఎందుకు బిగించారు లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి.
మైత్రి నిర్మాతలు తమ బ్యానర్ వేల్యూకి తగ్గట్టే భారీ బడ్జెట్ తో అమిగోస్ ని తెరకెక్కించినట్టు మేకింగ్ లోనే తెలిసిపోతోంది. మూడు షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా ఉండగా కంప్లీట్ నెగటివ్ క్యారెక్టర్ చేయడం ఆసక్తి రేపుతోంది. మిగిలిన పాత్రలను ఎక్కువగా ఓపెన్ చేయలేదు కానీ ఏదో డిఫరెంట్ గా చూపించబోతున్న ఇంప్రెషన్ అయితే కలిగించారు. జిబ్రాన్ నేపధ్య సంగీతంతో పాటు ఒకనాటి ఇళయరాజా క్లాసిక్ ఎన్నో రాత్రులొస్తాయి పాట రీమిక్స్ ఆల్రెడీ హిట్ ఛార్ట్స్ ఎక్కేసింది. మొత్తానికి అంచనాలు పెంచేలా ఉన్న అమిగోస్ యాక్షన్ లవర్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలానే ఉంది. కంటెంట్ కూడా ఇలాగే ఉంటే మరో హిట్టు పడ్డట్టే.
This post was last modified on February 3, 2023 7:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…