టాలీవుడ్లో కరోనా టైంలో రిలీజ్ డేట్ల గందరగోళం ఎలా సాగిందో తెలిసిందే. ఒకప్పుడు ఒక డేట్ ఇచ్చి దాన్ని మార్చాలంటే పరిపరి విధాలా ఆలోచించేవారు. దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా ఫీలయ్యేవాళ్లు. కానీ కరోనా పుణ్యమా అని ఆ ఫీలింగ్ అంతా పక్కకు వెళ్లిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమానే ఐదారుసార్లు రిలీజ్ డేట్ మార్చుకునేసరికి.. ఇక మిగతా సినిమాలకు డేట్లు మార్చే విషయంలో ఎవరికీ మొహమాటాలు ఉండట్లేదు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాయిదా అంటున్నారు. డేట్ మార్చేస్తున్నారు.
ఐతే పదే పదే డేట్లు మార్చడం వల్ల గందరగోళం తప్పట్లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయం నెలకొంటోంది. ఫిబ్రవరి సినిమాల విషయంలోనూ ప్రస్తుతం ఇదే అయోమయం కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ నెలలో రిలీజ్ డేట్లు ఇటు ఇటు అయ్యాయి. చివరికి ఏ వారం ఏ సినిమా అన్నది ఫిక్స్ అయినట్లే కనిపించింది.
కానీ ఇప్పుడు మళ్లీ గందరగోళం తప్పట్లేదు. 17న ‘శాకుంతలం’ వస్తుందన్న అంచనాతో ఆ రోజే రావాల్సిన విశ్వక్సేన్ సినిమా ‘ధమ్కీ’ని కొంచెం వెనక్కి జరిపారు. అలాగే ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ను కూడా హోల్డ్‌లో పెట్టారు. తీరా ఇప్పుడు చూస్తే ‘శాకుంతలం’ వాయిదా అంటున్నారు. దీంతో ‘ధమ్కీ’, ‘సార్’ సినిమాల టీంలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తమ చిత్రాలు వాయిదా అన్న అంచనాతో కొంచెం తాపీగా వర్క్ చేసుకుంటుండగా.. ఇప్పుడు ‘శాకుంతలం’ వాయిదాతో హడావుడి పడుతున్నారు. విశ్వక్ సినిమా అయితే ఆ రోజు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్లే. ‘సార్’ను మాత్రం 17నే తేవాలనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను ఒక రోజు వెనక్కి జరుపుతున్నారన్నది తాజా సమాచారం.
కాగా 17న పోటీ తక్కువ ఉండేట్లయితే శివరాత్రి వీకెండ్‌ను ఉపయోగించుకోవడం కోసం ఫిబ్రవరి 10న రావాల్సిన ‘అమిగోస్’ను వారం వెనక్కి జరిపే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ సినిమా ఇక్కడ ఖాళీ చేస్తే దాన్ని ఇంకో సినిమా ఏదో ఒకటి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ‘శాకుంతలం’ వాయిదా వార్తల పుణ్యమా అని చాలా గందరగోళమే తలెత్తినట్లు కనిపిస్తోంది.
This post was last modified on February 3, 2023 10:57 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…