ఓటిటిలు మనుగడ సాధించాడనికి ప్రధాన కారణం ఒకే అకౌంట్ ని ఇద్దరి నుంచి నలుగురు పంచుకునే వెసులుబాటు ఉండటం. అంటే చందా వెయ్యి ఉంటే తలో రెండు వందల యాభై రూపాయలు వేసుకుని షేర్ చేసుకునే వాళ్ళు. దీని వల్లే అమెజాన్ ప్రైమ్ కు ఇండియాలో భారీ కౌంట్ ఉంది.
ప్రపంచ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మాత్రం దీని వల్ల జరుగుతోన్న నష్టాన్ని గుర్తించి ఆ మేరకు కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఇవి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. యుఎస్ లాంటి దేశాల్లో ఈ షేరింగ్ పద్దతి వల్లే 100 మిలియన్ల యుజర్లు అసలైన ఓనర్లు కాదని గుర్తించిందట.
రాబోయే పద్ధతి ప్రకారం అసలైన సబ్స్క్రైబర్ ముందు ఏ వైఫై నెట్ వర్క్ లో లాగిన్ అయ్యుంటాడో దాన్ని వాడే మిగిలిన వాళ్ళు కనీసం నెలరోజులకు ఒకసారి అదే నెట్ వర్క్ లోకి వచ్చి ప్రవేశించాలి. లేదంటే బ్లాక్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. హైదరాబాద్ లో సురేష్ తన అకౌంట్ ని రాజమండ్రిలో ఉన్న కిరణ్ తో పంచుకున్నాడు. అయితే కిరణ్ కు అది పని చేయాలంటే నెలకోసారి సురేష్ ఇంటికి వచ్చి ఆ వైఫై లోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నామనుకుంటే తాత్కాలికంగా కొంత డబ్బు కట్టి నెట్ ఫ్లిక్స్ ని వాడుకోవచ్చు. లేదంటే రాదు.
మతలబు బాగుంది కదూ. ప్రస్తుతానికి ఇండియాలో కాదు కానీ అమెరికాలో లాంచ్ చేయబోతున్నారు. తర్వాత క్రమంగా మన దేశానికి తీసుకొస్తారు. అసలే నెలవారి రేట్లు అధికంగా ఉన్నాయని ఓటిటి లవర్స్ మొత్తుకుంటున్న టైంలో ఇలాంటి ట్విస్టులు పెడితే పైరసీ లాంటి వాటిని మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది. ఆహా, హాట్ స్టార్, ప్రైమ్, సోనీ లివ్ లు ఇలాంటి కండీషన్లు ఏమీ పెట్టే ఆలోచనలో లేవు. ఒకవేళా భవిష్యత్తులో అనుసరిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకపక్క థియేటర్ల టికెట్ రేట్లు బరువై ఇంట్లోనే కాలక్షేపం చేద్దామంటే మరోపక్క ఓటిటిలు ఇలాంటి మెడ మీద కత్తులు పెడితే వినోద ప్రియులకు కష్టమే
This post was last modified on February 2, 2023 6:00 pm
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…