టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ పేరే మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్య వాల్తేరు వీరయ్యతో దేవిశ్రీ ప్రసాద్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు కానీ పోలిక ప్రకారం చూసుకుంటే చేతిలో ఉన్న సినిమాల పరంగా తను చాలా వెనుకబడి ఉన్న మాట వాస్తవం.
పుష్ప 2 ఒకటే గట్టిగా చెప్పుకునే ప్యాన్ ఇండియా మూవీ. అయితే తమన్ స్పీడు, ట్రాక్ రికార్డు ఎంత బలంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ప్రతిసారి టార్గెట్ అవుతూనే వస్తున్నాడు. కాపీ ట్యూన్లకు సంబంధించి ఒకసారి, హీరోలను పొగడటం గురించి మరోసారి ఇలా ఏదో విధంగా యాంటీ ఫ్యాన్స్ లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ రావడానికి కారణం ఉంది. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమన్ రామ్ చరణ్ 15 గురించి మాల్టాడుతూ ఇది చాలా స్పెషల్ గా ఉంటుందని శంకర్ కోసం ప్రత్యేకమైన సౌండ్ ఇచ్చానని చెప్పాడు. మహేష్ బాబు 28 ప్రస్తావన వచ్చినప్పుడు అతడు నుంచి త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్న తనకు ఇది డ్రీమ్ కాంబో అని బెస్ట్ చూస్తారని హామీ ఇచ్చాడు.
ఇటీవలే విజయ్ వారసుడు గురించి ఏ రేంజ్ లో ఆకాశానికెత్తాడో చూశాంగా. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో తాను బాలయ్య లైఫ్ టైం అభిమానిగా చెప్పుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే ప్రభాస్, వెంకటేష్, బన్నీ, చిరంజీవి అందరికీ ఇలాగే అన్న సందర్భాలున్నాయి
ఇప్పుడా వీడియోలన్నీ బయటికి తీసుకొచ్చి వాటిని కలుపుతూ ఇంతకూ తమన్ ఎవరి ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి తమన్ ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడనేది పక్కనపెడితే పెద్ద స్టార్లతో వర్క్ చేస్తున్నప్పుడు టెక్నీషియన్లు ఎవరైనా సరే ఇలా చెప్పుకోవడం సహజం.
మొన్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలకు పని చేసిన వాళ్ళు ఆయా ఈవెంట్లలో విడివిడిగా చిరు బాలయ్యలే తమ అభిమాన హీరోలుగా చెప్పుకున్నారు. తమన్ విషయానికి వస్తే అందరికీ అదే అప్లై చేయడం వల్ల వచ్చిన తిప్పలివి. దీనికెప్పుడైనా విడిగా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి
This post was last modified on February 2, 2023 5:56 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…