నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో కొంత ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ‘భలే భలే మగాడివోయ్’తో అతడి రేంజ్ మారిపోయింది. ఆ సినిమా నాని స్థాయికి మించి చాలా పెద్ద హిట్ అయింది. అక్కడ మొదలైన ఊపు అరడజను సినిమాల వరకు కొనసాగింది. వరుస హిట్లతో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. కానీ అక్కడి నుంచి తర్వాతి దశకు మాత్రం వెళ్లలేకపోయాడు. ఇందుకు ఒక రకంగా మాస్ సినిమాలు చేయకపోవడం కూడా ఒక కారణం. అలాగే నిలకడగా సక్సెస్‌లు రాకపోవడం కూడా మైనస్ అయింది. ‘వి’ సహా కొన్ని మాస్ సినిమాలు చేసినా నాని రేంజ్ .పెరగలేదు.
ఐతే ఇప్పుడు నాని ‘దసరా’తో బాక్సాఫీస్ దగ్గర తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే మామూలు హిట్ కాదని, నాని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్ అయినా ఆశ్చర్యం లేదన్నది ట్రేడ్ వర్గాలు, విశ్లేషకుల మాట.
‘దసరా’ సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పాన్ ఇండియా స్థాయిలో అది ట్రెండ్ అయింది. వేరే భాషల వాళ్లు కూడా ఈ టీజర్లో కంటెంట్ ఉందని గుర్తించారు. నాని కెరీర్లో ఇంత మాస్‌గా, రఫ్‌గా ఒక సినిమా చేయడం ఇప్పటిదాకా జరగలేదు. నానికి ఉన్న సాఫ్ట్ ఇమేజ్‌ను బట్టి చూస్తే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం ఆశ్చర్యం. ఐతే ఇలాంటి పాత్రలతోనే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతుంటాయి. అందుకు ‘పుష్ఫ’ ఒక ఉదాహరణ. ఆ సినిమా జాతీయ స్థాయిలో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ‘దసరా’ కూడా అలా క్లిక్ అయినా ఆశ్చర్యం లేదు.
నాని సైతం ఈ సినిమా గురించి చెబుతూ కేజీఎఫ్-2, కాంతార, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద రేంజి సినిమాల ప్రస్తావన తెచ్చాడు. టీజర్ వరకు మంచి విషయం ఉన్నట్లు కనిపించిన ‘దసరా’ సినిమా పరంగా కూడా అంతే మెప్పిస్తే తెలుగులోనే కాక వేరే భాషల్లోనూ గట్టిగానే ప్రభావం చూపొచ్చు. సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయి నాని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న నెక్స్ట్ లెవెల్ స్టార్ ఇమేజ్, మార్కెట్ అతడి సొంతం కావచ్చు.
This post was last modified on February 1, 2023 9:43 pm
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…