వెండితెరపై మనం చూసే కల్పిత పాత్రలకు కొన్నిసార్లు నిజ జీవిత వ్యక్తులు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంటారు. సంక్రాంతి రిలీజై మంచి హిట్టయిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ప్రధాన పాత్రకు విషయంలోనూ అలాగే జరిగిందట. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్రను పరిటాల రవి స్ఫూర్తితోనే తీర్చిదిద్దినట్లు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
పరిటాల రవి గురించి తాను విన్నది, చదివింది దృష్టిలో ఉంచుకుని ఆ పాత్రను డిజైన్ చేసినట్లు అతను వివరించాడు. ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తిగా పరిటాల రవిని దృష్టిలో ఉంచుకునే చేసినట్లు గోపీచంద్ చెప్పడం విశేషం.
ఒక సందర్భంలో పోలీసులు తనను తనిఖీ చేస్తుంటే.. పరిటాల రవి తన జీపుకి ఆనుకుని అదేం పట్టనట్లు స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న ఫొటోను తాను పేపర్లో చూశానని.. అది దృష్టిలో ఉంచుకునే ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్లో చనిపోతూ కూడా స్టైల్‌గా బాలయ్య చుట్ట తాగే సన్నివేశం పెట్టానని గోపీచంద్ చెప్పాడు. ఇక వీరసింహారెడ్డిని శత్రువులు విదేశాల్లో చంపడం వెనుక కూడా పరిటాల రవి గురించి తాను తెలుసుకున్న ఒక విషయం స్ఫూర్తిగా నిలిచిందని అతను వెల్లడించాడు.
పరిటాల మీద ఎటాక్ జరిగి చనిపోవడానికి ముందు ఆయన్ని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని.. ఆ టూర్‌కు ఆయన వెళ్లి ఉంటే బతికేవారని అంటారని.. ఒకవేళ పరిటాల విదేశాలకు వెళ్లి అక్కడ ఆయన మీద ఎటాక్ జరిగితే అన్న రకంగా ఆలోచించి తాను ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టినట్లు గోపీచంద్ వెల్లడించాడు. రాయలసీమలో పరిటాల రవికి ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే వీరసింహారెడ్డి పాత్రను కూడా తీర్చిదిద్దామని.. సినిమాలో చూపించిన సన్నివేశాలు అలాగే పరిటాల జీవితంలో జరిగి ఉండకపోవచ్చని.. కానీ ఆ పాత్ర ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on February 1, 2023 9:38 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…