టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. గత ఏడాది నితిన్ పెళ్లి చేసుకోగా.. ఈ మధ్యే శర్వానంద్ నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడిక మెగా కుర్రాడు వరుణ్ తేజ్ వంతు వచ్చినట్లుంది. ముందుగా కూతురు నిహారికకు పెళ్లి చేసిన నాగబాబు.. కొడుకు పెళ్లి కోసం రెండేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ప్రస్తుతం ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. వరుణ్ పెళ్లి దాదాపు ఖాయం అయిపోయినట్లే కనిపిస్తోంది. ఐతే అమ్మాయి ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే పెళ్లి తర్వాత వరుణ్ వేరు కాపురం పెడతాడని కూడా నాగబాబు హింట్ ఇవ్వడం విశేషం. వరుణ్ పెళ్లి గురించి నాగబాబు ఏమన్నాడంటే..
‘‘వరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయంపై నేను ఇప్పుడే కామెంట్ చేయను. తనకు కాబోయే భార్య గురించి స్వయంగా వరుణే వెల్లడిస్తాడు. పిల్లల్ని కంట్రోల్ చేయాలని నేనెప్పుడూ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలన్నది నా సిద్ధాంతం. అందుకే ఇప్పటికే నేను, నా భార్య ఒక చోట.. వరుణ్ మరోచోట ఉంటున్నాం. పెళ్లి తర్వాత కూడా వరుణ్ వేరుగా ఉంటాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే’’ అని నాగబాబు చెప్పాడు.
ఇక మెగా, అల్లు కుటుంబాల మధ్య వైరం గురించి నాగబాబును అడగ్గా.. ఇదంతా ఉత్త ప్రచారమే అని, తామందరం ఒక్కటే అని నాగబాబు స్పష్టం చేశాడు. 33 ఏళ్ల వరుణ్ తొమ్మిదేళ్ల కిందట ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అతడి కెరీర్లో ఫిదా, ఎఫ్-2 లాంటి పెద్ద హిట్లున్నాయి. ప్రస్తుతం అతను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’తో పాటు ఓ కొత్త దర్శకుడితో ఇంకో థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.
This post was last modified on February 1, 2023 12:57 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…