షూటింగ్ మొదలుపెట్టడం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఖుషి టీమ్ కి షాక్ ఇస్తూ సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంటోందన్న విషయం కొద్ది రోజుల క్రితమే లీకైన సంగతి తెలిసిందే. దాన్ని ఇవాళ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటిస్తూ సామ్ తమ టీమ్ తో ఉన్నట్టు చెప్పేసింది. దీంతో నిజాలకు పుకార్లకు అన్నింటికి చెక్ పడిపోయింది. కనీసం రెండు మూడు వారాల పాటు ఈ చిత్రీకరణ ఉండొచ్చని ముంబై టాక్. అప్పటిదాకా సామ్ హైదరాబాద్ వచ్చే ఛాన్స్ లేనట్టే. శాకుంతలం ఎలాగూ వాయిదా పడింది కాబట్టి ప్రమోషన్ల బరువు తప్పింది.
ఇక ఖుషీ విషయానికి వస్తే ఇంకో పాతిక శాతం కంటే తక్కువే బ్యాలన్స్ ఉందని యూనిట్ వర్గాల సమాచారం. గట్టిగా కూర్చుంటే ఒక నెలలో అయిపోవచ్చట. విజయ దేవరకొండ కేవలం ఈ మూవీ కోసమే ఎదురు చూస్తున్నాడు. అవతల గౌతమ్ తిన్ననూరి బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే హెయిర్ స్టైల్ తో సహా విజయ్ దానికి ప్రత్యేకంగా మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఖుషి గెటప్ లోకి మారడం కష్టం. అందుకే ముందిది పూర్తి చేస్తే తర్వాత పోలీస్ యునిఫార్మ్ లోకి వెళ్లిపోవచ్చు. మైత్రి సంక్రాంతి రిలీజులు ఇతరత్రా వ్యవరాహలతో బిజీగా ఉండటం వల్ల పూర్తి ఫోకస్ పెట్టలేదు.
యశోద టైంలో ఎలాగైతే సామ్ తన నిస్సహాయ పరిస్థితి గురించి వివరణ ఇచ్చిందో ఇప్పుడు ఖుషికి సంబంధించి కనీసం ఒక ట్వీట్ లో ఏదైనా క్లారిటీ ఇస్తే బెటరని రౌడీ హీరో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లేకపోతే కావాలని సిటాడెల్ కు వెళ్లిన కామెంట్లకు రెక్కలొస్తాయని భావిస్తున్నారు. శుభమాని ఆనారోగ్యం గురించి కోలుకుని బయటికి వస్తే ఇప్పుడిదంతా సమంతాకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే. ఖుషి దర్శకుడు శివ నిర్వాణ త్వరలో రీ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు కానీ అదెప్పుడన్నది ఆయనా గట్టిగా చెప్పలేకపోయారు. అసలు ముహూర్తబలమే బాలేదేమో ఖుషికి ఒకటే బ్రేకులు.
This post was last modified on February 1, 2023 10:53 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…