మావయ్య కృష్ణ, బావమరిది మహేష్ బాబుల అండతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. కొన్నేళ్ల తడబాటు తర్వాత కాస్త నిలదొక్కుకున్నాడు సుధీర్ బాబు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం లాంటి సినిమాలు నటుడిగా అతడి ప్రతిభను చాటిచెప్పాయి. మంచి పాత్ర, స్క్రిప్టులకు అతను న్యాయం చేయగలడనే భరోసాను కలిగించాయి.
ఐతే కేవలం మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటే సరిపోదు. కమర్షియల్ హిట్లు ఇస్తేనే ఏ హీరో అయినా ఇండస్ట్రీలో నిలబడేది. కానీ కొంత కాలంగా సుధీర్ బాబుకు అస్సలు కలిసి రావడం లేదు. గత ఏడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో అతను ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇవేవీ తీసిపడేయదగ్గ సినిమాలు కాదు. మంచి ప్రయత్నాలే. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సుధీర్ ఖాతాలో ఫ్లాపులను జమ చేశాయి.
కొత్త ఏడాదిలో ఒక యాక్షన్ సినిమాతో సక్సెస్ సాధించాలని, రీచ్ కూడా పెంచుకోవాలని చూశాడు సుధీర్. కానీ ‘హంట్’ రూపంలో అతడికి మామూలు షాక్ తగల్లేదు. జనాలు ఇంకా సంక్రాంతి సినిమాల మాయలోనే ఉండడం, డబ్బింగ్ మూవీ అయిన ‘పఠాన్’ మంచి బజ్ తెచ్చుకోవడంతో ‘హంట్’కు ముందు నుంచి హైప్ కనిపించలేదు. సుధీర్ కెరీర్లో అత్యంత లో బజ్‌తో రిలీజైన సినిమాల్లో ఇదొకటని చెప్పాలి. దీంతో టాక్ చాలా కీలకం అయింది. కానీ మలయాళ హిట్ ‘ముంబయి పోలీస్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో బ్యాడ్ టాక్ వచ్చింది. బజ్ లేని సినిమాకు సూపర్ టాక్ వస్తే తప్ప పుంజుకోవడం కష్టం.
కానీ అసలే లో బజ్, ఆపై బ్యాడ్ టాక్ రావడంతో ‘హంట్’ ఏ దశలోనూ పైకి లేవలేకపోయింది. వచ్చిన వసూళ్లు మెయింటైనెన్స్‌కు మాత్రమే సరిపోయాయి. చెప్పుకోదగ్గ షేర్ ఏమీ రాలేదు. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ‘గే’ క్యారెక్టర్లో జనాలకు పెద్ద షాకే ఇచ్చాడు సుధీర్. ఇలాంటి సాహసం అందరూ చేయలేరు. అతడి నటన కూడా ఆకట్టుకుంది. కానీ ఏం లాభం సినిమా మాత్రం తేడా కొట్టేసింది. ఈ రిజల్ట్ సుధీర్ కెరీర్‌కు గట్టి దెబ్బే అనడంలో సందేహం లేదు. సుధీర్ ఎంతో కష్టపడి ఒక సాహసోపేత పాత్ర చేస్తే ఇలాంటి ఫలితం రావడం విచారకరం.
This post was last modified on January 31, 2023 4:36 pm
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…