క్లాస్ సినిమాలతో ఎన్నేళ్ళు ముందుకు సాగుతాం ? మాస్ సినిమాలే మనకి ఫ్యాన్ బేస్ పెంచుతాయని భావిస్తున్నట్టున్నారు కుర్ర హీరోలు. అందుకే వరుసగా మాస్ కథలతో , ఊర మాస్ పాత్రలను వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాని గురించి. మొదటి సినిమా ‘అష్టాచెమ్మా’ నుండి అంటే సుందరనికీ వరకు నాని క్లాస్ కథలు , స్టైలిష్ పాత్రలతోనే మెప్పించాడు. ఇప్పుడు ఉన్నపళంగా కొత్త దారి వెతుక్కున్నాడు. దసరా తో తనలో ఉన్న మాస్ ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. నాని మాస్ హీరోగా క్లిక్ అయితే ఇకపై కూడా దసరా లాంటి రా సినిమాల కౌంట్ పెంచే అవకాశం ఉంది.
ఇస్మార్ట్ శంకర్ తో ఇప్పటికే మాస్ బ్లాక్ బస్టర్ టేస్ట్ చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్ ఇక నుండి మాస్ సినిమాలే చేయాలని భావిస్తూ అదే రూట్లో వెళ్తున్నాడు. రెడ్ , వారియర్ రెండూ మాస్ సినిమాలే. కానీ వర్కవుట్ అవ్వలేదు. అందుకే మాస్ కి పెట్టింది పేరు అయిన బోయపాటి శ్రీను తో ఇప్పుడు మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు. ఇందులో సరికొత్త రామ్ కనిపిస్తాడని, మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇస్తాడని అంటున్నారు.
నితిన్ కూడా మాస్ దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ‘మాచర్ల నియోజవర్గం’ సినిమాతో మాస్ కంటెంట్ ప్లాన్ చేసుకున్న నితిన్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ మాస్ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమాలో మాస్ లుక్ లో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఈసారి మాస్ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ కూడా మాస్ అవతారమెత్తనున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడితో మాస్ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఇలా కుర్ర హీరోలంతా మాస్ కథలు , మాస్ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఆ కంటెంట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
This post was last modified on January 31, 2023 3:55 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…