Movie News

క్లాసులు ఎప్పుడు తీసుకుంటారు సర్

స్టార్ ఎవరైనా సరే సినిమాకు బజ్ రావాలంటే ప్రమోషన్లు చాలా కీలకం. అలాంటిది ఇంకో పద్దెనిమిది రోజుల్లో రిలీజ్ పెట్టుకుని నిర్లిప్తంగా ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. ధనుష్ హీరోగా తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందుతున్న సర్ ఈ నెల 17 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సితార లాంటి పెద్ద బ్యానరే అయినప్పటికీ ఎందుకో పబ్లిసిటీ విషయంలో దూకుడు చూపించడం లేదు. ఒరిజినల్ వెర్షన్ లో వాతి టైటిల్ తో రూపొందిన ఈ కాలేజీ డ్రామాలో హీరో పాత్ర లెక్చరర్ గా చేయడంతో పాటు దానికి సంబంధించి కూడా ఏదో డిఫరెంట్ ట్విస్ట్ పెట్టారని టాక్ ఉంది.

అసలే ఆ రోజు పోటీ గట్టిగా ఉంది. ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం గత పది రోజులు ఊళ్లు తిరుగుతూనే ఉన్నాడు. క్రికెట్ మ్యాచులు ఆడాడు. నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కనీస హైప్ రావాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. పైగా కాంపిటీషన్ లో సమంతా శాకుంతలం ఉంది. అసలే అది ప్యాన్ ఇండియా మూవీ. గుణశేఖర్ బృందం కూడా మెల్లగా సౌండ్ చేయడం మొదలుపెట్టింది. సామ్ ముంబై నుంచి తిరిగి రాగానే తనవైపు నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. ఎటొచ్చి సర్ మాత్రం మౌనమునిలా ఎందుకు తపస్సు చేస్తున్నాడో అంతు చిక్కడం లేదు.

ఎంత బైలింగ్వల్ అయినా సర్ సాధారణ ఆడియన్స్ కి డబ్బింగ్ లాగే అనిపిస్తోంది. ఈ అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేసి పబ్లిక్ లో ఉన్న అభిప్రాయాన్ని మార్చాలి. ధనుష్ కి ఇక్కడేమీ బలమైన మార్కెట్ లేదు. ఓటిటిలో తన సినిమాలను చూసి ఆహా ఓహో అనే బ్యాచ్ తప్ప నిజంగా వాళ్లంతా థియేటర్లకు వస్తారన్న నమ్మకం లేదు. పైగా దర్శకుడు వెంకీ అట్లూరి సైతం హిట్ ట్రాక్ లో లేడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే తర్వాత చేస్తున్న సినిమా ఇది. తనకీ ప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. చుట్టూ ఇంత ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి సర్ వీలైనంత త్వరగా క్లాసులు తీసుకుంటే వసూళ్లకు తోడ్పడుతుంది.

This post was last modified on January 31, 2023 1:31 pm

Share
Show comments

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

38 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago