బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు మామూలు ఆనందంలో లేడు. నాలుగేళ్లకు పైగా గ్యాప్ తర్వాత రిలీజైన ఆయన కొత్త సినిమా ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే మూడొందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం రేపిందా సినిమా. శని, ఆదివారాల్లో కూడా భారీ వసూళ్లు గ్యారెంటీ అని స్పష్టమవుతోంది.
వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టేయడం పక్కా. ఇంతటి సంచలనం రేపుతున్న సినిమాను షారుఖ్ అసలు ఆఫ్ లైన్లో అసలు ప్రమోట్ చేయలేదు. ఆన్ లైన్లో కూడా అభిమానులతో ఒకసారి చిట్ చాట్ చేశాడే తప్ప.. పెద్దగా చేసిందేమీ లేదు. ఎప్పట్లా సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివి అస్సలు చేయలేదు షారుఖ్.
రిలీజ్ ముందు చేసినట్లే.. రిలీజ్ తర్వాత షారుఖ్ మరోసారి ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా ఒక అభిమాని ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మీరెందుకు సినిమాను ప్రమోట్ చేయలేదు.. బయటికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. దీనికి షారుఖ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు కాబట్టి నేను కూడా ఈసారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ షారుఖ్ చమత్కరించాడు. నిజానికి ఈసారి తన సినిమాను షారుఖ్ ప్రమోట్ చేయకపోవడానికి కారణం ఉంది.
‘పఠాన్’ చుట్టూ ముసురుకున్న వివాదాల సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్లు ఈ మధ్య ఏం మాట్లాడినా.. దాని చుట్టూ కాంట్రవర్శీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ‘పఠాన్’ చుట్టూ ఉన్న వివాదాలకు తోడు.. తాను ఇంటర్వ్యూల్లో ఏదైనా మాట్లాడితే ఇంకా గొడవ చేసి సినిమాను దెబ్బ తీస్తారేమో అని షారుఖ్ సైలెంటైపోయాడు. సినిమాకు ఆల్రెడీ కావాల్సినంత హైప్ ఉండడంతో ప్రమోషన్లు అవసరం లేదని ఊరుకున్నాడు. ఈ వ్యూహం బాగానే పని చేసింది.
This post was last modified on January 29, 2023 4:18 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…