Movie News

ఫ్యాన్స్ అతి చేశారు.. అందుకే చెప్పట్లా-హరీష్

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడప్పుడూ తన టెంపర్ చూపించే టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. స్వయంగా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన హరీష్.. తన అభిమాన హీరోతో చేయబోయే రెండో సినిమాకు సంబంధించి ఇంతకుముందు ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుండేవాడు.

కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. కొన్నాళ్ల నుంచి పవన్ అభిమానులను పెద్ద ఎత్తున ఆయన ట్విట్టర్లో బ్లాక్ చేస్తూ వస్తున్నారు కూడా. ఇదంతా ఫ్యాన్స్ చేసిన అతి వల్లే అంటున్నాడు హరీష్. తాను కూడా పవన్ అభిమానుల్లో ఒకడిని కావడం వల్ల.. తన ఎగ్జైట్మెంట్‌ను ఇంతకుముందు ఫ్యాన్స్‌తో పంచుకునేవాడినని.. పవన్‌ను కలిసినా, ఒక మంచి డైలాగ్ రాసినా, ఇంకేదైనా అప్‌డేట్ ఉన్నా.. వారితో షేర్ చేసుకునేవాడినని హరీష్ చెప్పాడు. కానీ ఈ మధ్య ఫ్యాన్స్ చేసిన అతి వల్ల తాను హర్టయినట్లుగా హరీష్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హరీష్ వ్యాఖ్యానించాడు.

పవన్‌తో హరీష్ చేయబోతున్న ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ ప్రారంభోత్సవానికి ముందు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెగెటివ్ ట్రెండ్ చేశారు. ఇది తమిళ హిట్ ‘తెరి’కి రీమేక్ అన్న అంచనాతో ఈ సినిమా వద్దే వద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు. ఇది హరీష్‌ను హర్ట్ చేసినట్లుంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకా కాదా.. రీమేకే అయితే దాన్ని ఎలా చేశాం.. అన్నది తాను ఇప్పుడు మాట్లాడనని.. తెరపైనే చూడాలని హరీష్ వ్యాఖ్యానించాడు. ఐతే తాను మిగతా దర్శకుల్లా కాకుండా చాలా ఓపెన్‌గా ఉంటానని, ఇంతకుముందు అభిమానులతో ప్రతి విషయాన్నీ తాను పంచుకునేవాడినని.. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్లు చేసిన అతి చూసి ఇకపై వాళ్లకు ఏమీ చెప్పకూడదని ఫిక్సయినట్లు వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా నెగెటివ్ ట్రెండ్ చేసిన వాళ్లను ‘సోషల్ మీడియా మేధావులు’ అని వ్యంగ్యంగా అన్నాడు హరీష్. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటో చెబుతూ.. పవన్ డేట్లు ఇస్తే వేగంగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నామని.. కచ్చితంగా ఈ ఏడాదే షూటింగ్ ఆరంభమవుతుందని.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ఉన్నామని హరీష్ వెల్లడించాడు.

This post was last modified on January 30, 2023 6:30 am

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

54 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago