గత ఏడాది కాలంలో బాలీవుడ్ భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా బోల్తా కొడుతూ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. దీంతో బాలీవుడ్ పనైపోయిందని.. ఇక రికవరీ కష్టమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.
షారుఖ్ ఖాన్ రీఎంట్రీ మూవీ పఠాన్ పరిస్థితి కూడా ఇంతకంటే భిన్నంగా ఉండదన్న అంచనాలు కూడా కలిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆ స్థాయిలో క్యాంపైనింగ్ నడిచింది. కానీ లాల్ సింగ్ చడ్డాకు జరిగినట్లు పఠాన్‌కు ఈ నెగెటివ్ ప్రచారం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. దీని ట్రైలర్ షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులకు నచ్చింది. వేరే కారణాల వల్ల కూడా సినిమాకు మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే సినిమా వసూళ్ల మోత మోగించబోతుందని అర్థమైంది.
ఆ అంచనాలకు తగ్గట్లే రిలీజ్ రోజు నుంచి పఠాన్ వసూళ్ల సునామీ అంటే ఏంటో చూపిస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ పఠాన్ గ్రాస్ వంద కోట్లు దాటిపోగా.. తర్వాతి రెండు రోజుల్లో కూడా సినిమా ఏమాత్రం తగ్గలేదు. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసిందీ సినిమా.
ఇండియా వరకే పఠాన్ రూ.200 కోట్ల దాకా వసూలు చేయగా.. ఓవర్సీస్ వసూళ్లు రూ.110 కోట్లను దాటిపోయాయి. శుక్రవారానికే సినిమా ఇంత దూకుడు చూపించగా.. ఇక శని, ఆదివారాల్లో పఠాన్‌కు ఎదురే ఉండకపోవచ్చు. రెండు రోజుల్లో తలో వంద కోట్ల వసూళ్లు పక్కా అన్నట్లే ఉంది పరిస్థితి.
అంటే ఐదు రోజుల్లో షారుఖ్ సినిమా రూ.500 కోట్ల మార్కును టచ్ చేయబోతోందన్నమాట. పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు ఫుల్ రన్లో వంద కోట్లు వసూలు చేయడం గగనం అయిన పరిస్థితుల్లో దశాబ్దానికి పైగా హిట్టు లేని, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేసిన షారుఖ్ ఇలాంటి విధ్వంసం సాగించడం అనూహ్యం.
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…