అబ్బే రొటీన్ మాస్ సినిమాలను ఇకపై ప్రేక్షకులు చూడారు. ఇక నుండి విజువల్ వందర్స్ కే ప్రేక్షకులు పట్టం కడతారు. ఇవన్నీ కోవిడ్ తర్వాత వింటూనే ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మాస్ కంటెంట్ ను ప్రాపర్ మీటర్ లో సెట్ చేసి కమర్షియల్ సినిమా తీస్తే ఎలాంటి ఢోకా ఉండదని తాజాగా వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాక్ , ధమాకా,అఖండ,వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య.
అవును ‘అఖండ’ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ రొటీన్ కథలతో వచ్చిన మాస్ సినిమాలే. ‘అఖండ’ కోసం బోయపాటి కూడా మాస్ కంటెంట్ తీసుకున్నప్పటికీ డెవోషనల్ టచ్ ఇవ్వడంతో భారీ వసూళ్లు అందుకుంది. ఇక క్రాక్ , ధమాకా , వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలన్నీ పరమ రొటీన్ కథలతో వచ్చిన మాస్ బొమ్మలే.
కానీ కమర్షియల్ మీటర్ సెట్ చేసుకొని దర్శకులు ఈ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. ఏ మాటకామాటే ఇప్పుడున్న పరిస్థితిల్లో రొటీన్ కథలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించడం గొప్ప విషయమే. మొబైల్ చేతిలో కొచ్చేశాక సగటు మాస్ ప్రేక్షకుడు చాలా కంటెంట్ చూస్తున్నాడు. కానీ పర్ఫెక్ట్ మీటర్ లో ఫ్యాన్స్ ను మాస్ ను మెప్పించగలిగితే మాస్ కంటెంట్ సినిమాలకు ఎప్పుడూ ఢోకా ఉండదని ఈ సినిమాలన్నీ కోట్ల వసూళ్లతో నిరూపించాయి.
ఈ మాస్ సినిమాలు ముఖ్యంగా ధమాకా , వీర సింహా రెడ్డి వాల్తేరు వీరయ్య ఇచ్చిన కోట్ల భరోసాతో చాలా మండి మేకర్స్ కమర్షియల్ మాస్ సినిమాల వైపే అడుగులేస్తున్నారు. కానీ మీటర్ సరిగ్గా కుదరకపోతే మాత్రం మేజిక్ రిపీట్ అవ్వదు అది గమనించుకుంటే మంచిది.
This post was last modified on January 28, 2023 11:06 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…