ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ NTR30 షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలా నెలలవుతుంది కానీ ఇంత వరకు షూటింగ్ మొదలు కాలేదు. ‘ఆచార్య’ రిజల్ట్ తర్వాత కొరటాల లెక్కలు మారాయి. ఆ డిజాస్టర్ ను మర్చిపోయేలా ఓ అదిరిపోయే కంటెంట్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నాడు కొరటాల. అందుకే స్క్రిప్ట్ రిపేర్ల కోసమే చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక తారక్ , కళ్యాణ్ రామ్ కూడా ఎప్పటికప్పుడు వారికి అనిపించిన సజీషన్స్ ఇస్తూనే ఉన్నారు. తప్పదు కొరటాల ఇప్పుడు ఎవరు సలహా ఇచ్చిన తీసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. RRR తర్వాత చేయబోతున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ కొరటాలకు ఎప్పటికప్పుడు తనకి తోచిన మార్పులు చెప్తూనే ఉన్నాడట. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుందని వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయట. ఎన్టిఆర్ కూడా లేటయినా పర్లేదు కానీ సాలిడ్ కంటెంట్ తోనే వెళ్దాం అంటూ టీంతో చెప్తూనే ఉన్నాడని అంటున్నారు. ఇక ఫిబ్రవరి మిస్ అయితే ఈ సినిమా షూటింగ్ మార్చ్ లేదా ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి మేకర్స్ ఘాట్ పై క్లారిటీ ఇస్తూ అప్ డేట్ వదిలేది ఎప్పుడో ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on January 28, 2023 11:01 pm
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…