‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ ఓకే చేసిన ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు విశ్వక్ సేన్ చేతిలో పడిందని తెలుస్తుంది. ‘చల్ మోహన్ రంగ’ దర్శకుడు కృష్ణ చైతన్య ఆ సినిమా తర్వాత నితిన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో కృష్ణ చైతన్య శర్వానంద్ ను అప్రోచ్ అవ్వడం మరో కథతో సినిమా సెట్ అవ్వడం జరిగింది.
శర్వానంద్ తో కృష్ణ చైతన్య సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయింది. రాశి ఖన్నా ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఉన్నపళంగా ఏమైందో, ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ను కృష్ణ చైతన్య విశ్వక్ సేన్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. నిర్మాణ సంస్థ కూడా మారనుందని సమాచారం. ముందుగా లాంచ్ అయిన పీపుల్ మీడియాలో కాకుండా సితార ఎంటర్టైన్ మెంట్స్ లో ఈ సినిమా చేయబోతున్నాడట కృష్ణ చైతన్య.
తాజాగా ‘బుట్ట బొమ్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ తను సితార బేనర్ లో నాగ వంశీ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాని వచ్చే పది రోజుల్లో ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించాడు. మరి విశ్వక్ తో నాగ వంశీ ప్లాన్ చేస్తున్న సినిమా కృష్ణ చైతన్య దే అని టాక్.
This post was last modified on January 28, 2023 10:39 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…