అసలు భారతదేశంలోనే ఒక సినిమా శతదినోత్సవం జరుపుకోవడం చూసి ఎంత కాలమయ్యిందో చెప్పమంటే ఠక్కున చెప్పడం కష్టం. లాంగ్ రన్ లు మాయమైపోయి మహా అయితే మూడు నాలుగు వారాలు బలంగా నిలబడితే చాలు బ్లాక్ బస్టరనే పరిస్థితికి ఎప్పుడో వచ్చేశాం.
అడవి రాముడు ఏడాది ఆడటం, పసివాడి ప్రాణం అయిదు ఆటలతో నూర్రోజుల వేడుక చేసుకోవడం, సమరసింహారెడ్డి రూపాయికి అయిదు రూపాయలు లాభం ఇవ్వడం ఇవన్నీ చరిత్రలో మిగిలిపోయిన గొప్ప అద్భుతాలు. ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు జనాల మైండ్ సెట్ కూడా మారిపోయి కేవలం కలెక్షన్లను మాత్రమే సక్సెస్ కి కొలమానంగా చూస్తున్నారు
అలాంటిది జపాన్ లో ఒక తెలుగు సినిమా అది డబ్బింగ్ వెర్షన్ అయినా సరే హండ్రెడ్ డేస్ పోస్టర్ వేసుకోవడమంటే చిన్న విషయం కాదు. డైరెక్ట్ గా 42 కేంద్రాల్లో, షిఫ్టింగ్ తో కలిపి 114 సెంటర్లలో ఈ సంబరం జరుపుకోనుంది. ఈ మేరకు రాజమౌళి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే ఈ స్వీట్ షాకింగ్ న్యూస్ ని పంచుకున్నారు.
కలెక్షన్ల పరంగా ఆల్రెడీ నెంబర్ వన్ గా ఉన్న ముత్తుని పక్కకు తోసేసిన ఆర్ఆర్ఆర్ జపాన్ లో ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కానీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇటీవలే డాల్బీ విజన్ ప్రింట్ ని అప్ డేట్ చేస్తే దానికీ హౌస్ ఫుల్స్ పడ్డాయి.
గోల్డెన్ గ్లొబ్ సాధించడం, ఆస్కార్ నామినేషన్లలో నాటు నాటుకి చోటు దక్కడం, అకాడెమి ఈవెంట్ జరిగే మార్చి దగ్గరకొచ్చే కొద్దీ అంతర్జాతీయ ఫిలిం మేకర్స్ మద్దతు ట్రిపులార్ కి దక్కడం వగైరా పరిణామాలు జక్కన్న వైపు సానుకూల గాలులు వీచేలా చేస్తున్నాయి.
దానికి తోడు ఇప్పుడీ జపాన్ రన్ ఇంటర్నేషనల్ మీడియాని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పనిగట్టుకుని ప్రమోషన్ కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు అంత దూరం ఎందుకు వెళ్లారో ఇప్పుడు ఫలితం చూశాక అర్థమవుతోంది. తెలుగు సినిమా గర్వాన్ని అందనంత ఎత్తులో నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ ఇంకా చైనాకు వెళ్ళలేదు. అక్కడేం సెన్సేషన్ చేస్తుందో
This post was last modified on January 28, 2023 3:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…