పఠాన్ బాలీవుడ్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టరని ముంబై మీడియా చేస్తున్న హడావిడి మాములుగా లేదు. ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ వచ్చినట్టు చెబుతున్న లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటిదాకా 200 కోట్ల గ్రాస్ దాటేసింది. అందులో షేర్ 125 కోట్ల పైమాటే. ఈ వీకెండ్ అయ్యేలోగా ట్రిపుల్ సెంచరీ దాటడం ఖాయమని ట్రేడ్ పండితులు బల్లలు గుద్ది మరీ చెబుతున్నారు. ఈ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే దేశం మొత్తంలో ఏ థియేటర్లోనూ ఒక్క టికెట్ కూడా మిగలకూడదు. మొత్తం హౌస్ ఫుల్సే పడుండాలి. ప్రధాన నగరాల్లోని స్క్రీన్లన్నీ కిక్కిరిసిపోవాలి.
కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరే కనిపిస్తోంది. దాని సాక్ష్యం కావాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. పేటిఎం, బుక్ మై షో యాప్స్ ఓపెన్ చేసి ముంబై, పూణే, అహ్మదాబాద్ తదితర నగరాల్లోని బుకింగ్ స్టేటస్ చూస్తే విషయం అర్థమైపోతుంది. మరీ ఖాళీగా లేవు కానీ ట్విట్టర్ కనిపించినంత రేంజ్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే లేదు. కౌంటర్ సేల్స్ ఎక్కువగా ఉండొచ్చు కానీ ప్రతి చోటా అలాగే ఉంటుందని నమ్మకంగా చెప్పలేం. ముఖ్యంగా కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లను దాటించాలనే తాపత్రయం పఠాన్ ట్రెండ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని వచ్చినంత యునానిమస్ టాక్ దీనికి ఇండియా వైడ్ రాలేదన్నది వాస్తవం.
ఫైనల్ గా ఈ అంకెల పందెం ఎక్కడ దాకా ఆగుతుందో చెప్పలేం కానీ యాక్షన్ డోస్ విపరీతంగా దట్టించేసిన పఠాన్ లో షారుఖ్ మాస్ అవతారానికి మాత్రం ఫ్యాన్స్ బాగా ఫిదా అయిపోయారు. సుమారు పదేళ్ల తర్వాత దక్కిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. నగరాల్లో షారుఖ్ దూకుడు భీభత్సంగా ఉన్న మాట నిజమే కానీ బిసి సెంటర్లలో యాక్షన్ తప్ప ఎమోషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ తక్కువగా ఉన్న ఈ మసాలా మూవీకి ఆదివారం తర్వాత కఠిన పరీక్షే ఎదురు కానుంది. అప్పుడు నమోదయ్యే డ్రాప్ శాతాన్ని బట్టి పఠాన్ నిజంగా ఎంతటి మొనగాడో తేలిపోతుంది.
This post was last modified on January 27, 2023 1:11 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…