Movie News

సీనియర్ స్టార్ హీరోకి ఒంటరి అవమానం

కోట్లాది అభిమానుల ఫాలోయింగ్ ఉంది కదాని ఏ కథను బడితే అది సినిమాగా చేస్తే దెబ్బ తినడం ఖాయమని మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కి ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. ఒకప్పుడు దృశ్యం, మన్యం పులి, లూసిఫర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో కేరళ మార్కెట్ ని వందల కోట్ల స్థాయికి పెంచిన ఈ కంప్లీట్ యాక్టర్ కి ఇటీవలి కాలంలో ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురవుతోంది. దానికి కారణం నాసిరకం సినిమాలు చేయడమే. ఆ మధ్య మాన్స్ టర్ అనే మూవీ చేస్తే జనాలు థియేటర్ల నుంచి ఇదేం స్టోరీరా బాబు అని తలలు బాదుకున్నారు. కట్ చేస్తే పది రోజులకు ముందే టపా కట్టేయాల్సి వచ్చింది.

తాజాగా అలోన్ (ఒంటరి) అనే మరో సినిమాతో రిపబ్లిక్ డేకి వచ్చాడు. దర్శకుడు షాజీ కైలాష్. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ తో పరిశ్రమను ఊపేసిన కల్ట్ డైరెక్టర్ ఈయన. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టారు. కట్ చేస్తే దీనికి కనీస ఓపెనింగ్స్ రాలేదు. ప్రమోషన్లు ట్రైలర్ గట్రా చూశాక ఇందులో పెద్దగా మ్యాటర్ ఉండదని ఫ్యాన్స్ కి ముందే అర్థమైపోయింది. దీనికన్నా పఠాన్ చూడటం మేలని అటు షిఫ్ట్ అయిపోయారు. దీంతో మోహన్ లాల్ కెరీర్ లోనే అతి దారుణమైన ఓపెనింగ్ ని అలోన్ సొంతం చేసుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ మొత్తం కలిపి నలభై అయిదు లక్షలకు మించి రాలేదని ట్రేడ్ టాక్.

అంత వరస్ట్ ఇందులో ఏముందబ్బా అంటే ఒక వ్యక్తి లాక్ డౌన్ ప్రకటించాక ఎవరూ లేని ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ కి ఒక్కడే వెళ్తాడు. అక్కడ ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలకు ఎలా స్పందించాడనేది మెయిన్ పాయింట్. ఈ అలోన్ ఇటు హారర్ కాక థ్రిల్లర్ కాక ఎమోషన్ లేక అన్నిటికి చెడ్డ రేవడి అయ్యింది. దీంతో రెండో వారానికే దీన్ని థియేటర్ల నుంచి తీసేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఎంత స్టార్ హీరోలమైనా ఎంపిక విషయంలో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఉంటే ఇదిగో ఇలాంటి తిరస్కారాలే మళ్ళీ మళ్ళీ ఎదురవుతాయి

This post was last modified on January 27, 2023 12:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

2 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

2 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

2 hours ago

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…

3 hours ago

బన్నీ చేసిన తప్పు.. చేయని తప్పు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…

3 hours ago

అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…

3 hours ago