Movie News

రేట్లు తగ్గించలేదు.. థియేటర్లు వెలవెల

కరోనా తర్వాత జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోవడం, అదే సమయంలో టికెట్ల ధరలు పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఒక దశలో థియేటర్ల మనుగడే ప్రమాదంలో పడింది. అసలే టికెట్ల రేట్లు పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించడం చేటు చేసింది.

ఒక దశలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారి ఇండస్ట్రీ జనాలు బెంబేలెత్తిపోయారు. దీంతో నెమ్మదిగా రేట్లు తగ్గించి సినిమాలు రిలీజ్ చేయడం.. తమ చిత్రాలకు ధరలు తగ్గించామని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకోవడం చూశాం. ఇలా నిర్మాతలు దిగి వచ్చాకే సినిమాలకు మళ్లీ ఆక్యుపెన్సీ పెరిగింది. కానీ పరిస్థితి కొంచెం మెరుగుపడేసరికి మళ్లీ నిర్మాతల్లో అత్యాశ వచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు ఈ అత్యాశే లాంగ్ రన్ లేకుండా చేసిందన్నది ట్రేడ్ వర్గాల మాట.

‘వాల్తేరు వీరయ్య’ రెండో వీకెండ్ వరకు చాలా బాగా ఆడింది. ‘వీరసింహారెడ్డి’ తొలి వీకెండ్ వరకు సత్తా చాటింది. తెలంగాణ వరకు ఈ రెండు చిత్రాలను మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్లతో రిలీజ్ చేశారు. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ల రేటు దాదాపు ఇదే స్థాయిలో ఉండగా, మల్టీప్లెక్సుల్లో కొంచెం రేటు తక్కువ. ఐతే సంక్రాంతి టైంలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి రెండో వీకెండ్ వరకు ఈ రేటు పెట్టడం ఓకే. కానీ రెండో సోమవారం తర్వాత కూడా అవే రేట్లు కొనసాగించడం చేటు చేసింది.

రేట్లు తగ్గితే సినిమా చూద్దామని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ డిమాండ్ లేని టైంలో, వీక్ డేస్‌లో కూడా రేట్లు తగ్గించలేదు. దీంతో గత సోమవారం నుంచి రెండు సినిమాలూ పడుకున్నాయి. నిజానికి ఈ వారం ప్రేక్షకులకు సరైన ఆప్షన్ లేదు. ‘హంట్’కు బజ్ లేదు. ‘పఠాన్’ ఏమో డబ్బింగ్ సినిమా. సంక్రాంతి సినిమాలను సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.200తో ఆడించి ఉంటే రిపబ్లిక్ డేతో పాటు వీకెండ్‌ను బాగా ఉపయోగించుకునేవి. కానీ పాత రేట్లనే కొనసాగిస్తుండడంతో సరైన ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.

This post was last modified on January 27, 2023 6:24 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

27 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

1 hour ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago