25.. 50.. 75.. 100.. స్టార్ హీరోల కెరీర్లలో సినిమాల పరంగా ఇలాంటి మైలురాళ్ల దగ్గరికి వచ్చినపుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఐతే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమా గురించి మొన్నటిదాకా అసలే చర్చా లేదు. మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ లాగా వెంకీ అభిమానులు పెద్ద హడావుడి చేసే రకం కాదు.
వెంకీ సైతం తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం, పెయిడ్ ప్రమోషన్లు చేసుకోవడం, మైల్ స్టోన్ మూవీ టైం వచ్చినపుడు హడావుడి చేయడం లాంటి వాటికి దూరంగా ఉంటాడు. అందుకే ఆయన 75వ సినిమా గురించి వారం ముందు వరకు కూడా ఏ డిస్కషన్ లేదు. అసలు వెంకీ ఈ మైలురాయి ముంగిట ఉన్నాడన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమా ఎవరో ఉంటుందో క్లారిటీ కూడా లేదు.
కానీ సడెన్‌గా ‘హిట్’ ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో వెంకీ 75వ సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ‘సైంధవ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీంతో పాటే ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా లాంచ్ చేశారు. ఆ టీజర్ చూడగానే ఒక్కసారిగా జనాలకు సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. వెంకీ బెస్ట్ లుక్‌లో కనిపించడం.. ఆయన పాత్ర, కథ అన్నీ ఆసక్తికరంగా అనిపించడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఖరారవడంతో ఇంకో మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో సినిమా చేయడానికి అంగీకరించాడంటేనే క్యారెక్టర్ ఒక రేంజిలో ఉంటుందని అంచనా వేయొచ్చు. వెంకీ-నవాజ్ కాంబినేషన్ అమితాసక్తిని రేకెత్తించేదే. ఇందులో ఒక హీరో కీలక పాత్ర చేస్తాడని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘వెంకీ 75’ చాలా స్పెషల్‌గా ఉండబోతోందని, దాని రేంజే వేరని స్పష్టంగా తెలుస్తోంది.
This post was last modified on January 26, 2023 2:09 pm
ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…