సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ టీజర్ వచ్చేసింది. ఇంచుమించు ట్రైలర్ లెన్త్ లో కట్ చేయడంతో కథ పట్ల ఒక అవగాహన ఇచ్చేశారు. ముందు నుంచి ఇది కాటమరాయుడు రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ చేసిన వీరంని తెలుగు డబ్బింగ్ వచ్చాక కూడా ఏరికోరి మరీ పవన్ చేస్తే దాని ఫలితం తేడా కొట్టడం అభిమానులు ఇంకా మర్చిపోలేదు. కన్నడలో దర్శన్ ఓడయా పేరుతో తీసుకుంటే అక్కడా బోల్తా పడింది. కేవలం తమిళంలో మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. మనకు కనెక్ట్ కాకపోయినా సెంటిమెంట్ యాక్షన్ పుష్కలంగా ఉన్న బొమ్మ ఇది.
దీన్నే చాలా మార్పులు చేసి కండల వీరుడు హిందీ వెర్షన్ తీయించాడన్న ప్రచారం ముందు నుంచి ఉంది. కానీ వెంకటేష్ ఇందులో పూజా హెగ్డే అన్నయ్యగా నటిస్తున్నాడు. ఒరిజినల్ లో ఈ క్యారెక్టర్ లేదు. వెంకీ రేంజ్ హీరో ఒప్పుకున్నాడంటే వెయిటేజ్ చాలా ఇచ్చి ఉంటారు. పైగా గెటప్పు, బ్రతుకమ్మ సీన్లు, మాస్ స్టయిల్ లో తనకో ఫైట్ మొత్తం వేరే ఫ్లేవర్ లో కనిపిస్తోంది. సల్మాన్ పక్కన ముగ్గురు తమ్ముళ్లు మాత్రమే వీరంతో తెస్తున్న ప్రధాన పోలిక. పైగా సల్లు భాయ్ జులపాల జట్టు మీసంతో ఒకసారి, క్లీన్ షేవ్ తో మరోసారి ఇలా రెండు షేడ్స్ లో దర్శనమిచ్చాడు.
ఇవన్నీ చూస్తుంటే సందేహాలు రావడం సహజం అయితే ముంబై సోర్స్ మాత్రం ఇది వీరం రీమేకేనని కాకపోతే ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేయడం వల్ల గుర్తుపట్టడం కష్టమని అంటున్నారు. సో ఈ సస్పెన్స్ తీరాలంటే రంజాన్ పండగ దాకా ఆగాల్సిందే. వాస్తవానికి డిసెంబర్ రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా వేశారు. వెంకటేష్, పూజా హెగ్డే, జగపతిబాబులు ఉండటం వల్ల కిసీకా భాయ్ కిసీకా జాన్ మీద మన ఆడియన్స్ లోనూ ఆసక్తి ఉంది. ముఖ్యంగా విక్టరీ ఫ్యాన్స్ తమ హీరోకి బలమైన పాత్ర పడి ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు.
This post was last modified on January 25, 2023 9:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…