Movie News

విక్రమ్ చూపిన దారిలోనే సీనియర్లు

నిన్నటి తరం సీనియర్ స్టార్ హీరోలకు మంచి దశ నడుస్తోంది. న్యూ జెనరేషన్ ప్రేక్షకులను వీళ్ళను ఏ మేరకు రిసీవ్ చేసుకోగలరనే అనుమానాలకు చెక్ పెడుతూ అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కమల్ హాసన్ విక్రమ్ సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్, అందులో హీరోయిజంని ఎలివేట్ చేసిన తీరు మిగిలిన దర్శకులకూ స్ఫూర్తినిస్తూ అదే స్టయిల్ ని ఫాలో అయ్యేలా చేస్తోంది. ఆ సినిమాలో కమల్ మెషీన్ గన్ తో చేసిన విన్యాసాలు, మాఫియా గ్యాంగ్ తో తలపడినప్పుడు బులెట్ల వర్షం కురిపిస్తూ సాగించిన రచ్చ థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్ లో పేలింది.

ఇటీవలే మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి అచ్చం అదే తరహాలో ప్రీ క్లైమాక్స్ లో విలన్ డెన్ కు వెళ్లి గన్నుతో ఫైరింగ్ చేయడం విక్రమ్ నే తలపించింది. కట్ చేస్తే తాజాగా రిలీజ్ చేసిన వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ లోనూ పెద్ద చాంతాడంత తుపాకీని పట్టించి చాలా కాలం తర్వాత వెంకీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. నాగార్జున సైతం ది ఘోస్ట్ లో ఎన్నిసార్లు ఇలాంటి విధ్వంసం చేశారో చూశాం. అఖండ గుడి ఫైట్ లో గనుల వీరంగం గుర్తేగా. ఈ లెక్కన వయసుతో సంబంధం లేకుండా అగ్రజులను ఇలా చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో ఇలాంటి ఎపిసోడ్స్ బోలెడున్నాయని ఆల్రెడీ టాక్ ఉంది. ఇప్పుడంతా ఎలివేషన్ల జమానా. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యాభై అరవై దాటిన హీరోలతో వింటేజ్ లుక్స్ ని మ్యానరిజంని ట్రై చేస్తున్న యంగ్ డైరెక్టర్లందరూ దాదాపుగా మంచి ఫలితం అందుకుంటున్నారు. దానికి పైన చెప్పినవన్నీ మంచి ఉదాహరణలే. లోకేష్ కనగరాజ్, బాబీ, శైలేష్ కొలను, నెల్సన్ దిలీప్ కుమార్ వీళ్లంతా ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడను తీసుకొస్తూ కమర్షియల్ ఫార్ములాని మార్చి రాస్తున్నారు. వీళ్ళ వల్లే కుర్ర హీరోలు వేగంగా పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది

This post was last modified on January 25, 2023 9:57 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

43 mins ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

44 mins ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

2 hours ago

విజ‌య గంటా మోగేనా?

టీడీపీ సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావు వ‌రుస‌గా అయిదోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…

2 hours ago

‘కావలి’ కాచేది ఎవరో ?

ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల…

2 hours ago

రామాయణం లీక్స్ మొదలుపెట్టేశారు

ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్…

3 hours ago