వెంకటేష్ 75 వ సినిమాను కుర్ర దర్శకుడు శైలేష్ కొలను చేతిలో పెట్టాడు వెంకీ. సురేష్ బాబు, వెంకీ ఇద్దరు కలిసి 75 వ సినిమాకు కొందరు దర్శకులను అనుకోని ఫైనల్ గా శైలేష్ చెప్పిన కథకి ఓటేశారు. అయితే నిజానికి వెంకటేష్ 75 వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అప్పుడెప్పుడో వెంకటేష్ కి త్రివిక్రమ్ ఓ లైన్ చెప్పి ఫిక్స్ చేసుకొని ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఇక త్రివిక్రమ్ వరుస బడా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోవడంతో మధ్యలో వెంకీ సినిమా వైపు చూడలేదు. దీంతో చాలా రోజులు త్రివిక్రమ్ కోసం చూసి కొందరు దర్శకులను లాక్ చేసుకున్నాడు వెంకీ. అందులో శైలేష్ కి 75 వ సినిమా తగిలింది. ఇక వెంకీ ఫ్యాన్స్ కూడా రెండు మూడేళ్ళ క్రితం వెంకటేష్ ల్యాండ్ మార్క్ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు శైలేష్ వదిలిన గ్లిమ్స్ తో వెంకీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు , కానీ ఎప్పటి నుండో వెంకీ , త్రివిక్రమ్ కాంబో కోసం చూస్తున్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఏదేమైనా వెంకీ తన ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ మూవీ ను కుర్ర దర్శకుడి చేతిలో పెట్టడం గొప్ప విషయమే. మరి శైలేష్ మీద వెంకీ కి ఎందుకంత నమ్మకమో ? బహుశా ఈ దర్శకుడు తీసిన హిట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు.
This post was last modified on January 25, 2023 6:47 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…