నందమూరి బాలకృష్ణ రెండు దశాబ్దాల కిందట ‘నరసింహనాయుడు’తో కెరీర్ పీక్స్‌ను అందుకున్నారు. కానీ అంత పెద్ద సక్సెస్ తర్వాత ఆయన ఊహించని పతనం చవిచూశారు. ఆ పతనం ఏ స్థాయికి వెళ్లిందంటే.. బాలయ్య యూత్‌కు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయారు.
పలనాటి బ్రహ్మనాయుడు సహా చాలా చిత్రాల్లో బాలయ్య బాలయ్య చేసిన అతి విన్యాసాలు ప్రేక్షకులు ట్రోల్స్ రూపంలో ఏంజాయ్ చేయడానికి ఉపయోగపడ్డాయి తప్ప.. బాలయ్య కోరుకున్నట్లు కాదు. వరుసబెట్టి చెత్త సినిమాలు చేయడం.. దీనికి తోడు బాలయ్య బహిరంగ ప్రవర్తన బాగా లేకపోవడం వల్ల ఆయన ఇమేజ్ బాగా దెబ్బ తినేసింది.
ఇక బాలయ్య పనైపోయినట్లే అనుకున్న టైంలో ‘సింహా’ సినిమాతో మళ్లీ కాస్త కెరీర్‌ను ట్రాక్ ఎక్కించాడు బోయపాటి శ్రీను. కానీ మళ్లీ కథ షరా మామూలే. బాలయ్య మళ్లీ మళ్లీ కింద పడడం.. బోయపాటి కాపాడడం.. ఇలా సాగుతూ వచ్చింది వ్యవహారం.
ఐతే ‘అఖండ’తో తిరిగి పుంజుకోవడంతో పాటు ‘అన్ స్టాపబుల్’ షోతో యూత్‌తో పాటు అన్ని వర్గాల అభిమానం సంపాదించుకోవడంతో బాలయ్య కామెడీ ఇమేజ్ నెమ్మదిగా పక్కకు వెళ్లడం మొదలైంది. ఇదే సమయంలో ‘వీరసింహారెడ్డి’తో వరుసగా రెండో హిట్ కొట్టడం కూడా బాలయ్యకు కలిసొచ్చింది.
దీని తర్వాత అనిల్ రావిపూడి సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉండడంతో బాలయ్య మళ్లీ కెరీర్లో పతాక స్థాయిని అందుకున్నట్లు కనిపించాడు.. ఇటు సినిమాల పరంగా కెరీర్ బాగుంది. మరోవైపు ‘అన్‌స్టాపబుల్’తో మంచి రైజ్‌లోకి వచ్చాడు. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు కనిపిస్తుండడంతో బాలయ్యకు ఇక తిరుగులేదనుకున్నారు.
కానీ ‘వీరసింహారెడ్డి’ పెద్ద హిట్టయిన మత్తులోనో ఏమో.. బాలయ్య ఆ సినిమా విజయోత్సవ వేడుకలో నోరు జారాడు. ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడాడు. దీనికి తోడు అదే వేదికపై బూతులు ఇష్టానుసారం మాట్లాడాడు. అది చాలదన్నట్లు హనీ రోజ్‌తో కలిసి బహిరంగంగా మద్యం తాగుతూ పోజులు ఇచ్చాడు.
ఇవన్నీ ఒకట్రెండు రోజుల వ్యవధిలో ఆయన ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. కొన్నేళ్లు కష్టపడి పెంచుకున్న ఆదరణకు ఇవి కొంత మేర గండికొట్టాయనడంలో సందేహం లేదు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నడూ లేనంత వ్యతిరేకతను ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. మంచి పేరు సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది.. ఆ పేరు చెడగొట్టుకోవడానికి నిమిషం చాలు అని పెద్దలు ఊరికే అనలేదు. బాలయ్య విషయంలో ఇది అక్షరాలా రుజువవుతోంది.
This post was last modified on January 25, 2023 4:27 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…