ఇప్పుడు స్టార్ హీరోలందరూ కూడా ‘ఫ్యాన్స్’ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. తమ అభిమానులకు ఏం నచ్చుతుందో అదే చేస్తున్నారు. ఫ్యాన్స్ అన్నాక ఆటోమేటిగ్గా తమ అభిమానుల హీరోల వీరత్వాన్ని తెరపై చూడాలనుకుంటారు. యాక్షన్ దండిగా ఉండి.. ఎలివేషన్ సీన్లకు లోటు ఉండొద్దని.. తమ హీరోలు రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తూ చెలరేగిపోవాలని.. సినిమాలూ పక్కా మాస్‌గా ఉండాలని కోరుకుంటారు.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కూడా ఇటీవల తమ అభిమానులను అలరించే సినిమాలే చేశారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు, ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య పూర్తిగా అభిమానులను అలరించే వింటేజ్ అవతారాల్లో కనిపించారు. వారిని ఆద్యంతం ఉర్రూతలూగించారు. మరోవైపు తమిళంలో కమల్ హాసన్ సైతం ‘విక్రమ్’లో అభిమానులను అలరించే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా ఆ మార్గంలోనే నడవడబోతున్నట్లు స్పష్టమవుతోంది.
వరుసగా ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చిన వెంకీ.. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారిపోతున్నాడు. తన 75వ సినిమా కోసం ఆయన యాక్షన్ అవతారంలోకి మారిపోయాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా టీజర్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది. వెంకీ లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా వెంకీ కూడా ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తన మైల్ స్టోన్ మూవీ చేయాలని ఫిక్సయినట్లున్నారు. ‘హిట్’ సిరీస్‌లో ఇప్పటికే ఎంతో ఆకట్టుకున్న శైలేష్.. వెంకీతో ఒక అదిరిపోయే సినిమా అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
This post was last modified on January 25, 2023 4:36 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…